Home జోగులాంబ గద్వాల్ మున్సిపాలిటీ అక్రమాలపై విజిలెన్స్ తనిఖీలు

మున్సిపాలిటీ అక్రమాలపై విజిలెన్స్ తనిఖీలు

పనులు చేయకుండానే బిల్లులు ఎత్తేశారు
సుమారు రూ.5కోట్ల మేర పక్కదారి

Municipality-Gadwal

గద్వాల: రెండున్నరేళ్లుగా ఆడింది ఆట పాడింది పాటగా… గద్వాల మున్సిపాలిటీ లో అవినీతి అక్రమార్కులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు… ఎలాంటి పనులు చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులను కాజేశారు… దీనిపై గతంలో విజిలెన్స్‌కు ఫిర్యాదు అందాయి… ఈనే పథ్యంలో సోమవారం గద్వాల మున్సిపాలిటీలో హైదారాబాదుకు చెందిన విజిలెన్స్ బృందం పట్ట ణంలో కలియ తిరిగారు… గతంలో మున్సిపాలిటీలో ఇంజినీర్లుగా పనిచేసిన ముగ్గురు అధికా రులను సైతం వెంటబెట్టుకుని మరీ అభివృద్ధి పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై క్షుణ్ణంగా తనిఖీ లు నిర్వహించారు. ఇలా సుమారు రూ.10కోట్ల మేర జరిగిన పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తిం చినట్లు సమాచారం.

*పనులు చేయకుండానే దోచేశారు… మున్సిపాలిటీ పరిధిలో 33వార్డులున్నాయి. ఇందులో గడ చిన రెండున్నరేళ్ల కాలంలో సుమారు రూ.10కోట్ల విలువ కలిగిన సిసి రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. అయితే అభివృద్ధి పను లు చేస్తే వార్డులు బాగుపడతాయి… మనకేంటి లాభం అనుకున్న కొం దరు అవినీతి పరులు అక్రమాలకు తెరలేపారు.

తమకున్న పలుకుబ డితో స్కెచ్ వేసీ మరీ దోపిడికి పాల్పడ్డారు. ఆదోపిడి ఏ స్థాయిలో జరి గిందంటే కొన్ని చోట్ల ఎలాంటి పనులు జరగకుండానే కేవలం కాగి తాల మీదనే పనులు కానిచ్చేసి బిల్లులను ఎత్తేశారు.. ఇందులో ము ఖ్యంగా పాలక పక్షం వైపే అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.. దీనిపై గతంలోనే మున్సిపల్ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులు వెళ్లా యి.. ఆతరుణంలో డీఎస్పీ చిట్టిబాబు, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విజిలెన్స్ బృందం గద్వాల పట్టణంలో పర్యటించి వెళ్లింది.

అయితే చేసిన అభివృద్ధి పనుల వివరాలను సమగ్రంగా అందివ్వకుండా స్థాని క మున్సిపాలిటీ అధికారులు అక్రమాలను కప్పివేసే ప్రయత్నాలు చేశారు. ఇలా పలుమార్లు విజిలెన్స్ బృందం పట్టణంలో పర్యటించి పూర్తి సమాచారాన్ని సేకరించింది. ఈక్రమంలోనే సోమవారం వార్డు ల వారిగా జరిగిన పనుల వివరాలతో కూడిన జాబితాను వెంట బెట్టు కుని, గతంలో పనిచేసిన ఇంజినీరింగు అధికారులను సైతం వెంటబె ట్టుకుని మరీ తనిఖీలు చేపట్టారు.

కళ్లు బైర్లు కమ్మేలా అక్రమాలు…

*క్షేత్రస్థాయిలో తనిఖీలకు వెళ్లిన విజిలెన్స్ బృందానికి కళ్లు బైర్లు క మ్మే అక్రమాలు వెలుగుచూశాయి. కొన్ని చోట్ల ఎలాంటి పనులు చేయ కుండానే పనులు పూర్తి చేసినట్లు రికార్డులు సృష్టించి బిల్లులను ఎత్తేశా రు. ఇలా సుమారు రూ.5కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ బృందం గుర్తించడం జరిగింది. దీంతో మొత్తం నివేధికను తయారు చేసి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సమాచా రం. దీనిపై విజిలెన్స్ బృందాన్ని వివరణ కోరేందుకు యత్నించిగా వివరాలను వెల్లడించేందుకు విముఖతను వ్యక్తం చేశారు.