Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కల్తీ నూనె ట్యాంకర్‌ పట్టివేత

Oil-tanker

విశాఖ : అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న కల్తీ నూనె ట్యాంకర్ ను విజిలెన్సు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెచ్‌బి కాలనీలో ఓ నివాసంలో ఆరు వేల లీటర్ల కల్తీ నూనె ట్యాంకర్ ను నిల్వ చేసి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచారనే సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. వివిధ హోటళ్ల నుంచి వాడిన నూనెను నిర్వాహకులు సేకరిస్తున్నట్లు వారు గుర్తించారు. వాడిన నూనెను హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారని విజిలెన్స్‌ డిఎస్పి తెలిపారు. నిర్వాహకుడు రవీందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్‌ అధికారులు పేర్కొన్నారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Comments

comments