Home జోగులాంబ గద్వాల్ బీటీ-3పై విజి‘లెన్స్’

బీటీ-3పై విజి‘లెన్స్’

Vigilance on Beatty -3

గద్వాల వ్యవసాయ శాఖలో భారీ అవినీతి

రూ.6.50కోట్ల విత్తనాల కుంభకోణంపై రహస్య విచారణ

ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా ‘కూపీ’

పాత్రధారులు, సూత్రధారులపై ఆరా

ఈ ఏడాది జనవరిలో గద్వాల మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున రూ.6.50కోట్లు విలువ కలిగిన నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో మార్కెట్ యార్డులో ఓగోదాంలో కర్నూల్‌కు చెందిన శ్రీరామ కంపెనీకి చెందిన పత్తివిత్తనాలు అనధికారికంగా నిల్వ ఉంచిన సమాచారం తెలుసుకున్న అధికారులు పట్టుకోవడం జరిగింది. అనంతరం వీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపడం జరిగింది. ఇందుకు
సంబంధించి సదరు కంపెనీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. అయితే ఇక్కడి వరకు అధికారులు బాగానే పనిచేసినప్పటికీ తరువాత మాత్రం మిన్నకుండిపోయారు. కేవలం ఒక లాట్ మాత్రమే బీటీ-3 విత్తనాలుగా ల్యాబ్ పరీక్షలలో వెల్లడైనట్లు కట్టుకథ సృష్టించి తరువాత మొత్తం విత్తనాలను తిరిగి సదరు శ్రీరామ కంపెనీ యజమానులకు ఇచ్చివేశారు. అయితే దీని వెనకాల పెద్ద తతంగమే జరిగినట్లు, భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారినట్లు ఏకంగా వ్యవసాయ శాఖ నుంచే ఆరోపణలు వినిపించాయి. ఇదే విషయాన్ని మనతెలంగాణ వరుస కథనాలు ప్రచురితం చేయడం జరిగింది. అయితే తాజాగా రూ.6.50కోట్ల విలువ గలిగిన విత్తనాలన్నీ కూడ బీటీ-3 రకానికే చెందినవని ఈవిషయాన్ని అవినీతికి అలవాటు పడిన కొందరు వ్యవసాయ అధికారులు బయటకు పొక్కనీయకుండా అక్రమార్కులతో చేతులు కలిపినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో ఇటివలీ విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు భారీ కుంభకోణంపై రహస్యంగా విచారణ చేపట్టినట్లు పాత్రదారులు, సూత్రదాలు గురించి కూపిలాగుతునట్లు తెలిసింది. ఈ విజిలెన్ అధికారుల రహస్య విచారణపై మనతెలంగాణ ప్రత్యేక కథనం…

మనతెలంగాణ/గద్వాలప్రతినిధి: జోగులాంబగద్వాల జిల్లాల్లో పత్తివిత్తన సాగుకు పెట్టింది పేరు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దక్షిణాదిలో కాటన్ సీడు హబ్ అని కూడ చెప్పవచ్చు. సుమారు 40వేల ఎకరాల్లో సీడుపత్తి పంటను సాగు చేస్తూ, ఏటా రూ.1000 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో నడిగడ్డ ప్రాంతంలో సీడుపత్తి సాగుకు విపరీతమైన డిమాండు పెరిగిపోవడం, సుమారు 20కి పైగా సీడుపత్తికి సంబంధించిన మిల్లులు ఏర్పడడం జరిగింది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ సీడుపత్తి సాగు ముసుగులో కొందరు నకిలీ పత్తివిత్తనాలను విక్రయిస్తూ రైతన్నలను నిండాముంచుతున్నారు. ఈవిషయం వ్యవసాయ, విజిలెన్స్, పోలీసు శాఖలకు చెందిన అధికారులు జరిపిన పలుదాడుల్లో వెల్లడయ్యింది. అయితే ఈఎడాది జనవరిలో గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున ఎలాంటి లెక్కాపత్రం లేని సీడు లభ్యమైంది. దీని విలువ రూ.6.50 కోట్లు ఉంటుందని, నకిలీ విత్తనాలు ఉండవచ్చంటూ మొదట్లో వ్యవసాయ అధికారులు మీడియాకు వివరాలు తెలిపారు. అయితే ల్యాబ్ పరీక్షలు చేయిస్తే అస బీటీ-3పై విజి‘లెన్స్’ లు విషయం బయటకు వస్తుందంటూ పట్టుబడిన విత్తనాలను ల్యాబ్‌కు పం పుతున్నట్లు పేర్కోన్నారు. ఇలా ల్యాబ్‌కు పంపిన విత్తనాలు మొత్తం కూడ నిషేధంలో ఉన్న బీటీ-3 రకానికి చెందిన పత్తివిత్తనాలుగా పరీక్షల ద్వారా వెల్లడయింది. అయితే ఈవిషయాన్ని ఎక్కడా బయటకు రానీయకుండా సద రుఅక్రమార్కులు తమకున్న పలుకుబడితో పెద్ద స్థాయిలో పైరవీలు చేశారు. వ్యవసాయ శాఖలో అవినీతికి అలవాటు పడిన ఓఅధికారి సాయంతో మొత్తం వ్యవహారాన్ని నీరుగార్చి కేవలం ఒకలాట్‌కు సంబంధించిన విత్తనాలు మాత్రమే బీటీ-3 రకానికి చెందినట్లు కట్టుకథ అల్లి అదే రిపోర్టును తయారు చేశారు. ఇదే విషయంపై విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు రహస్యంగా వచ్చి విచారించినట్లు తెలిసింది. వీరి విచారణలో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైన ట్లు సమాచారం. ఇంత భారీ మొత్తంలో జరిగిన అవినీతి భాగోతా న్ని చూసిన వ్యవసాయ శాఖలో పనిచేసే ఓఅధికారి బదిలీ చేయిం చుకుని వెళ్లినట్లు గుర్తించారు. ఇపుడు విజిలెన్స్ అధికారులు చేపడుతున్న రహస్య విచారణతో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడు తున్నాయి. ఆకాశం ఉరిమి పిడుగు ఎపుడు పడుతుందో అన్న చందంగా భయం భయంగా కాలం వెల్లదీస్తున్నట్లు సమాచారం.