Search
Monday 24 September 2018
  • :
  • :

మహర్షితో గోవిందం

Vijay Devara Konda met with Mahesh Babu

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఓ పక్క బాక్సాఫీస్ కాసుల జోరుతో, మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలతో ఈ సినిమా హోరెత్తించేస్తోంది. అయినా సినిమా ప్రమోషన్లను ఇంకా ఆపట్లేదు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబును కలిశాడు విజయ్ దేవరకొండ. మహేష్ కొత్త సినిమా ‘మహర్షి’ సెట్‌లో విజయ్ ఆ స్టార్‌ను కలిసి సందడి చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరు హీరోలు కాసేపు ముచ్చటించారు. అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లితో కూడా విజయ్ మాట్లాడాడు. ఇక ‘గీత గోవిందం’ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఓపక్క మెగాస్టార్ ఆశీస్సులు అతనికి ఎలాగూ ఉన్నాయి. అలాగే అతను మిగతా హీరోలతోనూ సాన్నిహిత్యం పెంచుకుంటున్నాడు. ఇక యూత్‌లో చెప్పలేనంత క్రేజ్‌ను సంపాదించాడు విజయ్. ‘గీత గోవిందం’ సక్సెస్‌తో అతని తదుపరి సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లక్కీ గర్ల్ రష్మికా మండన్న హీరోయిన్‌గా నటించింది.

Comments

comments