Home సినిమా విజయ్ దేవరకొండ హీరోగా సినిమా షురూ

విజయ్ దేవరకొండ హీరోగా సినిమా షురూ

allu

అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మాతగా జిఎ2 బ్యానర్‌లో పరుశురాం దర్శకత్వంలో ‘పెళ్లిచూపులు’ ఫేం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.  అల్లు అయాన్ కెమెరా స్విచ్చాన్ చేయగా… బేబి అల్లు అన్విత క్లాప్ కొట్టింది. ఈ సందర్భంగా బన్ని వాసు మాట్లాడుతూ “శ్రీరస్తు శుభమస్తు ఫేం పరుశురాం దర్శకత్వంలో పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం మొదలైంది.  మే రెండవ వారం నుండి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. రొమాంటిక్ కామెడి ఎంటర్‌టైనర్‌గా సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా మణికంఠన్, మ్యూజిక్ డైరెక్టర్‌గా గోపిసుందర్‌లు పనిచేస్తున్నారు. పూర్తి వివరాలను అతి త్వరలో తెలియజేస్తాం”అని అన్నారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. యూత్‌ను అలరించే రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. హీరోగా నా కెరీర్‌లో మరో మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోతుంది”అని చెప్పారు. దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ “ప్రేక్షకులకు పూర్తి వినోదాన్నిచ్చే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. అన్ని కమర్షియల్ అంశాలతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాలని ప్లాన్ చేశాం”అని చెప్పారు.