Home సినిమా గోదావరి యాసలో డైలాగ్స్

గోదావరి యాసలో డైలాగ్స్

Vijay Devarakonda Dear Comrade

విజయ్‌దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తొండంగి అనే గ్రామంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇది పూర్తిగా కాకినాడ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. కాకినాడలోని ఓ కాలేజీలో స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నాడు విజయ్ దేవరకొండ. అదే కాలేజీలో క్రికెటర్‌గా కనిపిస్తుంది హీరోయిన్ రష్మిక. వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణంతో పాటు కాలేజ్ రాజకీయాలు ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయి. హీరోను కాస్త రెబల్‌గా చూపించే ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ బ్యాక్‌డ్రాప్‌ను, సెట్‌లో కొంతమంది కమ్యూనిస్టుల ఫొటోలను వాడుకుంటున్నామని ఫిల్మ్‌మేకర్స్ స్పష్టం చేశారు. సినిమా షూటింగ్ మొత్తం తూర్పు గోదావరి జిల్లాలోనే చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గోదావరి యాసలో డైలాగ్స్ చెబుతాడట. అతని డైలాగ్స్ సినిమాకు హైలైట్‌గా ఉంటాయని అంటున్నారు.