Home తాజా వార్తలు వైవిధ్య పాత్రలో విజయ్ దేవరకొండ…

వైవిధ్య పాత్రలో విజయ్ దేవరకొండ…

Vijay Devarakonda in a different role

హైదరాబాద్: టాలీవుడ్ లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ని ఎంచుకుంటూ అతి త‌క్కువ టైంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విజ‌య్ రీసెంట్‌గా ” నోటా” చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. తాజాగా డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.  త్వ‌ర‌లో “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” ఫెమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేయ‌నున్నాడు. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె.ఎస్. రామారావు సమర్పణ లో, కె.ఏ వల్లభ నిర్మాతగా, రాశీఖన్నా, ఐశ్వర్యరాజేష్, బ్రెజిల్ మోడల్ ఇసాబెల్లెడి కథానాయికలుగా నటించనున్నారు. వినూత్న ప్రేమ క‌థా చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర వైవిధ్యంగా ఉండ‌నున్నది.