Search
Thursday 15 November 2018
  • :
  • :

‘బిచ్చగాడి’గా విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

హైదరాబాద్: ‘పెళ్లిచూపులు’లాంటి జాతీయ అవార్డు విన్నింగ్ సినిమాతో ఒక్కసారిగా పాపులరైన హీరో విజయ్ దేవరకొండ. అంతకుముందు ‘లైఫ్‌ఈజ్ బ్యూటీఫుల్’, ‘ఏవడే సుబ్రహ్మణ్యం’ సినిమాల్లో సపోర్టింగ్ రోల్‌లో నటించాడు విజయ్. అయితే ఇటీవల విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ మూవీతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో టాలీవుడ్ అగ్రనిర్మాతలు, దర్శకులు విజయ్ కోసం క్యూ కడుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం విజయ్ ఈ మూవీ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డితో సౌత్‌లోని ఇతర ఇండస్ట్రీల దృష్టిలో పడ్డ విజయ్ త్వరలోనే కన్నడలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం చిన్న సినిమాగా విడుదలై తమిళంతో పాటు తెలుగులో సంచలన విజయం సాధించిన బిచ్చగాడు మూవీని కన్నడలో రీమేక్ చేసేందుకు పావులుకదుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎలాంటి ప్రకటన లేకపోయిన త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రానుంది. ప్రస్తుతం విజయ్ గీతాఆర్ట్ బ్యానర్‌లో పరుశురాం దర్శకత్వం వహిస్తున్న మూవీతో బిజీగా ఉన్నాడు.

Vijay Devarakonda in Bichhagadu Kannada Remake.

Comments

comments