Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

క్రేజీ ఫిలింలో విజయ్ దేవరకొండ

Vijayసూపర్‌హిట్ మూవీ ‘పెళ్లి చూపులు’తో క్రేజీ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. అంతకుముందు ‘ఎవడే సుబ్రమణ్యం’లో కూడా నానీతో కలిసి నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘అర్జున్ రెడ్డి’ మూవీ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.  ఈ సినిమా విశేషాలను విజయ్ దేవరకొండ తెలియజేస్తూ… “జస్ట్ టూ షాట్స్ కోసం రిషికేష్ వచ్చాం. డెహ్రాడూన్, ముస్సోరిలో కూడా షూటింగ్ చేయబోతున్నాం. ఇక్కడ మైనస్ డిగ్రీల టెంపరేచర్ ఉంది. మేం ఇటలీ, మ్యూనిచ్‌లో షూటింగ్ చేశాం. మంగుళూర్‌లో షూట్ చేశాం. హైదరాబాద్‌లో షూటింగ్ చేశాం. ఇన్ని ప్రాంతాల్లో ఎందుకంటే ‘అర్జున్‌రెడ్డి’ క్రేజీ ఫిలిం. ఒక వాస్తవ గాథ ఆధారంగా అర్జున్ రెడ్డి రూపొందింది”అని చెప్పాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ చిత్రం టీజర్ ఈనెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది.

Comments

comments