Home సినిమా విజయ్ దేవరకొండ నయా సినిమా షురూ

విజయ్ దేవరకొండ నయా సినిమా షురూ

Vijay-Devarakonda-Newsయంగ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై తొలి షాట్‌కు  టి.సుబ్బరామిరెడ్డి క్లాప్ కొట్టగా అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి షాట్‌కు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.  ఈ ప్రారంభ వేడుకలో అశ్వనీదత్, బివిఎస్‌ఎన్ ప్రసాద్, సి.కళ్యాణ్, నాగఅశ్విన్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ ప్రేమ కథా చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎస్.రామారావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః జెకె, సంగీతంః గోపీసుందర్.