Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

రాజకీయ నేపథ్యంలో భిన్నమైన పాత్ర

Vijay Devarakonda NOTA to release in October

ఇటీవల ‘గీత గోవిందం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘నోటా’. ఈ ద్విభాషా చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయనటువంటి  భిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘నోటా’ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈనెల 6న సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శాంతన కృష్ణణ్, ఎడిటర్ : రేమాండ్ డెరిక్ క్రాస్టా, కథ: షాన్ కరుప్పుసామి, కొరియోగ్రఫీ: బృందా.

Comments

comments