Home సినిమా విజయ్ దేవరకొండ చాలా గట్స్ ఉన్న హీరో

విజయ్ దేవరకొండ చాలా గట్స్ ఉన్న హీరో

Vijay devarakonda speech at Taxiwala Success Meet

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జిఎ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ బ్యానర్స్‌పై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా భీమవరంలో జరిగిన విజయ యాత్రలో హీరో విజయదేవరకొండ మాట్లాడుతూ “ఈ సినిమాకు ఎంజాయ్ చేసినంత ఏ సినిమాకు ఎంజాయ్ చేయలేదు. కొత్త కథ, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, రెండు పెద్ద బ్యానర్లు కలిసి తీసిన ఈ సినిమా కోసం ఒక సంవత్సరం పాటు కష్టపడ్డాం. విడుదలకు మూడు నెలల ముందు లీక్ అయిన ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది”అని అన్నారు. దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మాట్లాడుతూ “విజయ్ దేవరకొండ వంటి మంచి హీరో దొరకడం మా అదృష్టం. పైరసీ అయిన ఈ సినిమాను ఇంత బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు”అని పేర్కొన్నారు. నిర్మాత ఎస్‌కెఎన్ మాట్లాడుతూ “అనుభవమున్న దర్శకుడిలా రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హీరో విజయ్ దేవరకొండ చాలా గట్స్ ఉన్న హీరో. అతను కథను నమ్మి ఈ సినిమా చేశాడు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ పాల్గొన్నారు.

Vijay devarakonda speech at Taxiwala Success Meet

Telangana News