Search
Saturday 17 November 2018
  • :
  • :

‘డియర్ కామ్రేడ్’ అంటున్న విజయ్ దేవరకొండ

vijay

యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  దర్శకులు సుకుమార్, కొరటాల శివ, చంద్రశేఖర్ యేలేటి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలి సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా… దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి షాట్‌కు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. సుకుమార్, కొరటాల శివ స్క్రిప్ట్ అందించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిస్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌ః సుజిత్ సరంగ్, ఎడిటర్‌ః శ్రీజిత్ సరంగ్, డైలాగ్స్‌ః జై కుమార్, ఆర్ట్‌ః రామాంజనేయులు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః భరత్ కమ్మ.

Comments

comments