Home సినిమా రచయితగా విజయ్…

రచయితగా విజయ్…

Vijay Deverakonda

 

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్‌గా తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ మూవీ వచ్చేనెల 26న విడుదల కానుంది. అలాగే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో క్రీడా ప్రధానంగా సాగే మరో మూవీలో విజయ్ నటిస్తున్నారు. ‘హీరో’ అనే క్రేజీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీలో విజయ్ ప్రొఫెషనల్ బైక్ రైడర్‌గా కనిపిస్తారని వినికిడి.

ఈ రెండు చిత్రాలతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ ఓ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో విజయ్ పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ యంగ్ స్టార్ ఈ చిత్రంలో రచయితగా కనిపిస్తారట. అలాగే రచయితగా ఆయన రాసిన కథల పాత్రలలో మళ్ళీ ఆయన కనిపిస్తారట. వైవిధ్యంగా అనిపిస్తున్న ఈ కథనంతో విజయ్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో విశేషం ఏమిటంటే ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు.

Vijay Deverakonda as the writer in movie