Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

హర్రర్ కామెడీలో విజయ్ దేవరకొండ

vijay-Dewarakondaఎంతో కాలంగా టాలీవుడ్‌లో రాణించాలని ప్రయత్నించిన విజయ్ దేవరకొండ చివరికి ‘పెళ్లి చూపులు’ చిత్రంతో హీరోగా బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘ద్వారక’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పలు చిత్రాలు అతని చేతిలో ఉన్నాయి. తాజాగా అతనికి హార్రర్ కామెడీ మూవీలో నటించే అవకాశం లభించిందని సమాచారం. ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ యువి క్రియేషన్స్ విజయ్ దేవరకొండతో ఈ చిత్రం చేయబోతోందని తెలిసింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కే డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తారు.

Comments

comments