Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

‘శత’కొట్టిన విజయ్, కోహ్లీ : భారత్ 356/3

Vijay-and-Kohli

హైదరాబాద్ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్‌కోహ్లీ, ఓపెనర్ మురళీ విజయ్ శతకాలతో చెలరేగిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆది నుంచే దూకుడు ప్రదర్శించారు. రాహుల్ 2 పరుగుల స్వల్ప స్కోర్ వద్దే పెవిలియన్ బాట పటినా.. మురళీ విజయ్ (108) పుజారా(83) తో కలిసి రెండో వికెట్‌కు 178 పరుగులు భారీ స్కోర్‌ను జత చేశారు. ఆ తర్వాత 180 పరుగులు వద్ద పుజారా క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. విజయ్, కలిసి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. ఈ తరుణంలో 234 పరుగుల వద్ద విజయ్ తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత రహానే (45)తో జట్టు కట్టిన కోహ్లీ 10 ఫోర్లు బాది 130 బంతుల్లో సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీకి మంచి సపోర్ట్ ఇచ్చిన రహానే 60 బంతుల్లో 45 పరుగులు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ 111, రహానే 45 ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో అహ్మద్, మిరాజ్, ఇస్లాం తలో వికెట్ తీశారు.

Comments

comments