Home తాజా వార్తలు ఆ ఇద్దరితో ప్రేమలో పడ్డా: విజయ్ దేవరకొండ

ఆ ఇద్దరితో ప్రేమలో పడ్డా: విజయ్ దేవరకొండ

vijay devarakonda

 

హైదరాబాద్: టాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ యమక్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ‘డియర్ కామ్రెడ్’ సినిమా షూటింగ్‌లో విజయ్ స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో విజయ్ చేతికి బ్యాండేజ్ వేసుకున్నాడు. ఈ గాయపడిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోను చూసిన ఇద్దరు చిన్నారుల విజయ్‌కు ఏమైంది అంటూ ట్వీట్ చేశారు. వైద్యుడి దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకో అని సలహా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను నెటిజన్ ట్వీట్టర్‌లో పోస్టు చేస్తూ మీకు తగిలిన దెబ్బలకు మా చిన్నారులు చాలా బాధపడుతున్నారని ట్వీట్ చేశారు. ఈ వీడియోను చూసిన విజయ్ స్పందించారు. మీ పిల్లలతో ప్రేమలో పడ్డానని, తనకు డాక్టర్ అవసరం లేదని కానీ మీ ఇద్దరు పిల్లలను కలుస్తానని ట్వీట్ చేశాడు. విజయ్ కలిస్తే తమ పిల్లలు సంతోషానికి హద్దులు ఉండవని రిప్లై ఇచ్చారు. అమెరికా నుంచి శనివారం హైదరాబాద్‌కు వస్తామని తెలిపారు. మొబైల్ నంబర్ కావాలని నెటిజన్‌ను దేవరకొండ టీమ్ అడిగారు. ఈ సారి హైదరాబాద్ ట్రిప్ ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుందని ఆనందం వ్యక్తం చేశారు.