Home తాజా వార్తలు విజయ్ మాల్యా ఆస్తులు జప్తు

విజయ్ మాల్యా ఆస్తులు జప్తు

vijaymallia

న్యూఢిల్లీ : భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) షాక్ ఇచ్చింది. మాల్యాకు చెందిన రూ.100 కోట్ల విలువ చేసే ఫాం హౌస్‌ను ఇడి అధికారులు జప్తు చేశారు. ముంబయి శివారులోని అలీబాగ్‌ ప్రాంతంలో ఉన్న ఫాంహౌస్‌ను మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఇడి స్వాధీనం చేసుకుంది. గతంలో జప్తు చేసుకున్న బ్యాంకుల్లో నిల్వ నగదు ఉన్న రూ.34 కోట్లు, బెంగళూరు, ముంబయిల్లో ఉన్న ఫ్లాట్లను, తమిళనాడులోని పారిశ్రామిక స్థలం, కూర్గ్‌లో భూమి, యునైటెడ్‌ బ్రేవరీస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, ఇతర సంస్థల పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసింది.