Home తాజా వార్తలు విజయ్‌మాల్యా అరెస్టు

విజయ్‌మాల్యా అరెస్టు

VM

లండన్ : ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను స్కాట్‌లాండ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. భారత్‌లో వివిధ బ్యాంకులకు ఆయన సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఎగవేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన లండన్‌కు వెళ్లి అక్కడే ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన ఆస్తులను వేలం వేసి సుమారు 151 కోట్ల రూపాయలను మాత్రమే రికవరీ చేశారు. ఆయనను భారత్ రప్పించేందుకు సిబిఐ ఎన్నో ప్రయత్నాలు చేసింది. విజయ్ మాల్యాను ఏ క్షణమైనా భారత్‌కు తరలించే అవకాశం ఉంది. దీని కోసం సిబిఐ అధికారులు లండన్ వెళ్లనున్నట్లు సమాచారం.

విజయ్‌మాల్యా అరెస్టుపై భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి స్పందించారు. అవినీతి నిరోధంలో ప్రధాని మోదీ చొరవను స్వామి కొనియాడారు. విజయ్‌మాల్యా జైలుకు వెల్లే సమయం దగ్గరపడిందని వ్యాఖ్యానించారు.