Home బిజినెస్ విజయ్ మాల్యా ఆడంబరం, అహంకారం బాధితుడు : గోపినాథ్

విజయ్ మాల్యా ఆడంబరం, అహంకారం బాధితుడు : గోపినాథ్

bsns

ముంబయి: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్(కెఎఫ్‌ఎ) వవస్థాపకుడు విజయ్ మాల్యా ‘రాజకీయ కుట్ర కన్నా ఆడంబరం, అహంకారం బాధితుడు’ అని ఎయిర్ దక్కన్ చైర్మన్ జి.ఆర్.గోపినాథ్ విలేకరులతో అన్నారు. నోఫ్రిల్స్ ఎయిర్‌లైన్ ద్వారా అందుబాటు ధరలో విమానయానాన్ని అందించిన కీర్తి గోపినాథ్‌కు చెందుతుంది. ప్రబలమైన నియంత్రణల కారణంగానేన తమ కంపెనీని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు అమ్మేయాల్సి వచ్చిందన్నారు. 2007లో రూ. 1000 కోట్లకు ఎయిర్ దక్కన్‌ను కెఎఫ్‌ఎకు ఆయన అమ్మేశారు. 2012 నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నష్టాలను కూడగట్టుకున్నదని, బ్యాంకులకు రూ. 9000 కోట్లు బాకీ పడిందని అన్నారు. విజయ్ మాల్య ఇప్పుడు రుణ ఎగవేతదారుల్లో పోస్టర్‌బాయ్‌గా మారారు. రుణ ఎగవేత విషయంలో విజయ్ మాల్యా తెలివైన వాడేమి కాదని గోపినాథ్ అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ హయాంలో ఆయన అప్పులు పొందాడని తెలిపారు. ఏ పార్టీ పేరును పేర్కొనకుండానే విజయ్‌మాల్యా దేశం వదిలి పారిపోయేందుకు అవకాశమిచ్చారన్నారు. విజయ్‌మాల్యాకు ఫార్ములా వన్ రేసులు, ఐపిఎల్ వమ్యాచ్‌లు, స్విమ్‌సూట్ క్యాలెండర్లు అంటే మక్కువ ఎక్కువన్నారు. మాల్యా రాజకీయ కుట్ర బాధితుడేమి కాదని ఆయన పేర్కొన్నారు.