Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ముంబయి జైలు వీడియో పంపండి

మాల్యా అప్పగింతకు లండన్ సుముఖం
బ్యాంకుల నుంచి రూ. 9000 కోట్ల రుణాలు తీసుకున్న మాల్యా

Vijay Mallya: London court Demands Video of Mumbai Jail

లండన్: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌మాజీ అధినేత విజయ్ మాల్యా ని భారత్‌కు అప్పగించిన తరువాత, ఆయనని నిర్బంధించాలనుకుంటు న్న ముంబయిలోని ఆర్థూర్ రోడ్ జైలు బ్యారక్ 12 వీడియోని సమర్పించాలని లండన్ కోర్టు భారత్‌ని కోరింది. విజ య్ మాల్యా అప్పగింత కేసును విచారిస్తున్న వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఢిఫెన్స్ న్యాయవాదితో పాటు ప్రాసిక్యూషన్ లాయర్లు హాజరయ్యారు. విజయ్ మాల్యాని నిర్బంధించే జైలులోని బ్యారక్ 12 పై ఇరువురు వివరణ ఇచ్చారు. దీంతో మూడు నెలలో వీడియోని సమర్పించాలని మాల్యా అప్పగింత కేసుని విచారిస్తున్న లండన్ కోర్టు జడ్జి ఎమ్మా అర్బుత్‌నోట్ భారత్ అధికారులను కోరారు. సెప్టెంబర్ 12కి కేసుని వాయిదా వేసి అదే రోజు కేసుని ముగిస్తామని జడ్జి తెలిపారు. అప్పటి వరకు విజ య్ మాల్యా బెయిల్‌ని పొడిగించారు.

బ్యాంకుల నుంచి 9000 కోట్ల రుణాలు తీసుకుని చెల్లించకుండా పారిపోయిన నిందితుడని గతంలోనే బ్రిటన్ కోర్టుకు భారత్ సిబిఐ ఆధారాలతో తెలిపింది. అయితే తాను బ్యాంకులను మోసం చేయలేదని, తనపై మోపిన అభియోగాలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తమేమిటో చివరికి కోర్టులు నిర్ణయిస్తాయని విజయ్ మాల్యా లండన్ మీడియాతో చెప్పారు.62 ఏళ్ల వియజ మాల్యాని గత సంవత్సరం ఏప్రిల్‌లో భారత్ కోర్టు జారీ చేసిన అప్పగింత వారెంట్‌పై లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి మాల్యా బెయిల్‌పై ఉన్నారు. మోసం, హవాలా మార్గంలో కోట్లాది రూపాయలు సంపాదించాడని ఆయనపై అభియోగాలున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 27 న మాల్యా అప్పగింతపై విచారణ చేపట్టిన లండన్ కోర్టులో కేసు మలుపు తిరిగింది.

మాల్యాపై సిబిఐ లండన్ కోర్టుకి సమర్పించిన సాక్ష్యాధారాలను జడ్జి ఎమ్మా అర్బుత్‌నోట్ వాస్తవమేనని నిర్ధారించారు. దీంతో అప్పగింత కేసు విచారణ వేగవంతమైంది. భారత్ అధికారులు చూపిన ఆధారాలతో విచారణ చేపట్టవచ్చని జడ్జి ప్రకటించారు. లండన్ కోర్టులో సిబిఐ మాల్యాకు సంబంధించిన నేరాలపై పూర్తి వివరాలతో కూడిన డాక్యుమెంట్లని సమర్పించింది. అంతేకాకుండా ఐడిబిఐ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బికె బాత్రా ఒక కుట్రదారుడు, విలన్ అని ఆ పత్రాల్లో తెలిపింది. మాల్యాకు చెందిన, ప్రస్తుతం మూతపడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు బ్యాంకు రుణాలు మంజూరు చేయడంలో బాత్రా నిబంధనలను పాటించలేదని సిబిఐ డాక్యుమెంట్లలో తెలిపింది.

Comments

comments