Search
Thursday 15 November 2018
  • :
  • :

విజయ్ మాల్యా పాస్‌పోర్ట్ రద్దు

VIJAY_MALLYA-image-done-in-ఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా పాస్‌పోర్ట్‌ను విదేశీ వ్యవహారాల శాఖ రద్దు చేసింది. మాల్యాను తిరిగి భారత్ రప్పించడానికి పాస్‌పోర్ట్ అధికారులతో చర్చలు జరుపనున్నారు. వివిధ బ్యాంకులకు విజయ్‌మాల్యా తొమ్మిది వేల కోట్లు రుణం చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో మాల్యా మార్చి నెలలో భారత్ నుంచి లండన్ వెళ్లిపోయారు. మాల్యా ముంబయి కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఈడీ సమాన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మాల్యా కోర్టుకు హాజరుకాకపోవడంతో గత వారం కోర్టు మాల్యాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Comments

comments