Home ఆంధ్రప్రదేశ్ వార్తలు బాబుకు ‘చర్లపల్లి’ భయం పట్టుకుంది…

బాబుకు ‘చర్లపల్లి’ భయం పట్టుకుంది…

Vijaya Sai Reddy and babuఅమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ సర్కార్ ఘనవిజయం సాధిస్తే చర్లపల్లి జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఎపి సిఎం చంద్రబాబుకు భయం పట్టుకుందని వైసిపి నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసులో విచారణ చివరిదశకు చేరుకోవడంతో చంద్రబాబు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పారు. దీంతో చంద్రబాబు బుధవారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తన ఇంటికి పిలిపించుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికే తాను ఇచ్చిన రూ.1,200 కోట్లు సరిపోకపోతే మరో రూ.500 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు అన్నట్టు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy Fires On Chandrababu