Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

వెళ్లే ముందు జైట్లీని కలిశా

అప్పులను చెల్లిస్తానని మంత్రికి హామీ ఇచ్చా, లండన్ విచారణ కోర్టు దగ్గర మాల్యా
రూ.9000 కోట్లు బ్యాంకులకు చెల్లించకుండా పారిపోయిన లిక్కర్ కింగ్

Vijay Mallya appeared in fifth Test

లండన్ : తాను భారత్‌ని విడిచి వెళ్లే ముందు దేశ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి మాట్లాడానని విజయ్ మాల్యా లండన్‌లో మీడియాకు చెప్పారు. లండన్ కోర్టు బయట మాట్లాడిన మాల్యా దేశం విడిచి వెళ్లే ముందు అన్ని అంశాలను సెటిల్ చేస్తానని అరుణ్ జైట్లీకి అనేకసార్లు హామీ ఇచ్చానని ఆయన చెప్పారు. తాను చెప్పేది ఇది నిజమని అయన అన్నారు. 2016లో మాల్యా దేశం విడిచి పారిపోయిన సమయంలో అరుణ్‌జైట్లీ ఆర్థిక మం త్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని చెల్లించకుండా పారిపోయిన కింగ్ ఫిసర్ మాజీ యజమాని విజయ మాల్యాని తమకు అప్పగించాలని భారత్ కోరిన కేసుని విచారిస్తున్న లండన్ కోర్టు, మాల్యాని నిర్బంధించే జైలు బ్యారక్ విడియోని చూసే అవకాశముంది. ఈ కేసులో విచారణకు హాజరు కావడానికి మాల్యా వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చా రు. విజయ మాల్యాని గత సంవత్సరం ఏప్రిల్‌లో అరెస్ట్ చేసిన తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు.

కోర్టు ముం దు మీడియాతో మాట్లాడిన మాల్యా,  ఈ కేసులో కోర్టు తగిన నిర్ణయం తీసుకుంటుందని తనదైన శైలిలో చెప్పా రు. తాను కర్నాటక హైకోర్టు ముందు  ఒక సమగ్రమైన సెటిల్‌మెంట్ ప్రతిపాదన ఉంచానని, దీనిని ఆ కోర్టు అం గీకరిస్తుందని భావిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరికి చెల్లింపులు జరుగుతాయని కోర్టుకి తెలిపానని ఆయన అన్నారు. 9000 కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించకుండా బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యాపై భారత్ అతని అప్పగింత వారెంట్‌ని జారీ చేసింది. లండన్ పోలీసులు ఆయనని అరెస్ట్ చేశారు. తరువాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఈ కేసులో వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎమ్మా ఆర్బుత్‌నోట్  జూలైలో విచారణ జరిపినప్పుడు మాల్యాని నిర్బంధించాలనుకుంటున్న ముంబై ఆర్థర్‌రోడ్ జైలులోని బ్యార క్ 12కు సంబంధించిన ప్రతి అంశం విడియో తీసి కోర్టు లో దాఖలు చేయాలని భారత్‌ని కోరింది. గాలి, వెలుతురు, ఇతర సౌకర్యాలు తగినంతగా ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి విడియో తీసి పంపాలని తెలిపింది. ఈ బ్యారక్‌లో విచారణకు ముందు, విచారణ సమయంలో, ఒకవేళ శిక్షపడితే ఆయన ఉండటానికి అనువైన బ్యారక్ కాదనే అనుమాన నివృత్తి కొరకు విడియో ఇవ్వాలని కోరింది.  భారత ప్రభుత్వం తరపున  లండన్ కోర్టులో  వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సిపిఎస్) అందుకు సమ్మతించింది. కోర్టు కోరిన విడియోని సమర్పించింది. ఈకేసులో ఆఖరి విచారణ ముగింపు తేదీని జడ్జి త్వరలోనే ప్రకటిస్తారని సిపిఎస్ భావిస్తోంది.

Comments

comments