Home జాతీయ వార్తలు దుర్గగుడి ఇఒ పద్మ బదిలీ

దుర్గగుడి ఇఒ పద్మ బదిలీ

VIjayawada Kanakadurga Temple EO Padma Transferredఅమరావతి : వివాజయడలోని దుర్గగుడి ఇఒ పద్మను బదిలీ చేస్తూ శుక్రవారం ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దుర్గగుడి కొత్త ఇఒగా ఐఆర్‌ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను నియమించింది. కనకదుర్గమ్మకు ఓ భక్తురాలు సమర్పించిన చీర మాయం కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పాలకమండలి సభ్యురాలు సూర్యలత ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో పాలకమండలి నుంచి ఆమెను తొలగించారు. పాలనా వ్యవహారాల్లో పద్మ చురుగ్గా ఉండడం లేదన్న కారణంతోనే బదిలీ చేసినట్టు తెలిసింది. పద్మ ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండిగా మాత్రమే కొనసాగనున్నారు.

VIjayawada Kanakadurga Temple EO Padma Transferred