Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

సిఎం పాత్రలో విజయ్‌…

Vijays upcoming film titled Sarkar

చెన్నై: ఇళయ దళపతి విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సర్కార్’.  ఈ చిత్రానికి ఏఆర్‌ మురగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడని కోలీవుడ్‌ సినీ వర్గాలు అంటున్నాయి.  ఈ చిత్రంలో విజయ్  అమెరికాకు చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ గా కనిపించనున్నట్లు సమాచారం.  ఈ చిత్రంను చాలా కాలం తర్వాత అమెరికా నుండి చెన్నైకు వచ్చి రాజకీయాల్లో చేరిన టెక్ ఎగ్జిక్యూటివ్ ఏం చేశాడనే ఇతి వృత్తంతో  తెరకెక్కిస్తున్నారు. సినిమాలో విజయ్ పాత్ర గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీవితానికి దగ్గరగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది.  ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. తమిళనాడుకు చెందిన రాజకీయ నేత కళ కరుప్పయ్య ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు  చిత్రబృందం వెల్లడించింది.

Comments

comments