Search
Thursday 15 November 2018
  • :
  • :

‘విజేత’ ఘన విజయాన్ని అందుకోవాలి : చిరంజీవి

vijetha

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం ‘విజేత’. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకకు చిరంజీవితో పాటు ఎస్.ఎస్.రాజమౌళి, కీరవాణి, అల్లు అరవింద్, బివిఎస్‌ఎన్ ప్రసాద్, ఎన్.వి.ప్రసాద్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “35 ఏళ్ల క్రిందట నేను చేసిన విజేత సినిమా టైటిల్‌తో ఈ సినిమా రావడం సంతోషంగా ఉంది. దర్శకుడు నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు ఎంతో నచ్చింది. తండ్రి, కొడుకుల మధ్య అనుబంధాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. కళ్యాణ్‌దేవ్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. రొమాంటిక్ సీన్స్, ఎమోషన్స్ సీన్స్‌లో అతను చక్కగా నటించాడు. రాకేష్ శశి ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. నిర్మాత సాయి కొర్రపాటి ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు. సెంథిల్  కెమెరామెన్‌గా చేయడం సినిమాకు మొదటి సక్సెస్. విజేత సినిమా ఘన విజయాన్ని అందుకొని అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ “కళ్యాణ్‌దేవ్ కథను నమ్మి ఈ సినిమా చేశారు. సాయి నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను”అని తెలిపారు. ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ “ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు పెరిగాయి. కోడి సాంగ్‌ను ప్రేమ్క్ష్రిత్ బాగా కొరియోగ్రఫీ చేశారు. కళ్యాణ్‌దేవ్‌కు, చిత్ర యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను”అని చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ “విజేత సినిమా టైటిల్‌తో కళ్యాణ్‌దేవ్ ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. కొత్త టాలెంట్‌తో సినిమాలు చేసే నిర్మాత సాయి కొర్రపాటికి ఆల్ ది బెస్ట్‌”అని చెప్పారు.

Comments

comments