Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

మెగా అల్లుడి ‘విజేత’ టీజర్…

Vijetha Teaser Out now

హైదరాబాద్: మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ డెబ్యూ మూవీ విజేత టీజర్ విడుదలైంది. రాకేశ్ శ‌శి ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ కథనాయికగా నటిస్తోంది. టీజర్ లో కళ్యాణ్ నటన బాగుంది. విజేత కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ప్రేమ కథాంశంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే తండ్రి కొడుకుల మ‌ధ్య సాగే చిత్రంగా విజేత ఉంటుంద‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి’ నిర్మిస్తుండగా “బాహుబలి”కి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి ఫోటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముర‌ళీ శ‌ర్మ హీరో తండ్రి పాత్ర‌లో నటిస్తుండగా తనికెళ్ళభరణి, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జూలైలో మూవీ విడుదల కానుంది. ఇక త్వరలో జరుపుకోనున్న విజేత ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా హాజ‌రు కానున్నారు.

Comments

comments