Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

డ్యూయల్ రోల్‌లో విక్రమ్

Vikram,-samanthaసౌత్‌లో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న స్టార్ హీరో విక్రమ్. ఆయన కథానాయకుడిగా నటించిన తమిళ్ మూవీ ‘10 ఎంద్రతుకుల్ల’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పొడవైన మీసాలతో స్టైలిష్‌గా హాజరైన విక్రమ్ మాట్లాడుతూ సినిమాలో తాను డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నట్టు చెప్పాడు. డ్రైవర్ జాబ్‌లో ప్రతి సెకన్ ఎంతో విలువైనదని తెలిపే చిత్రమిదన్నాడు. ఈ సందర్భంగా హీరోయిన్ సమంతను ఆయన ఎంతగానో ప్రశంసించాడు. సమంత ఓ స్టైల్ ఐకాన్ అనీ, సినిమాలో ఆమె అద్భుతంగా నటించిందని ప్రశంసించాడు.

ఇక రొమాన్స్, యాక్షన్, కామెడీతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‘10 ఎంద్రతుకుల్ల’. వచ్చే నెల సినిమా ఆడియోను విడుదల చేసి అక్టోబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రాన్ని నిర్మిస్తున్న ఎ.ఆర్.మురుగదాస్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ పేరు తెలుసుకోవాలనుకుంటే చిత్రం చివరి వరకు ఆగాల్సిందే. ఎందుకంటే సినిమాలో ఆయా సన్నివేశాల్లో విక్రమ్ తన పేరును ఒక్కో సెలబ్రిటీ పేరుతో చెబుతూ ఉంటాడు. సమంత చుట్టూ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది. ఆమె విక్రమ్‌ను ప్రేమిస్తుంది. కానీ సినిమాలో డ్యూయెట్లు ఏమీ ఉండవు. ప్రస్తుతం విక్రమ్… ఆనంద్ శంకర్, అమిడ్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తున్నాడు.

Comments

comments