Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ముందస్తు పంచాయతీ ఎన్నికలు?

                   Village-Office

మన తెలంగాణ/ హైదరాబాద్ : గ్రామ పం చాయతీ ఎన్నికలకు గడువు కన్నా ముందుగానే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సం ఘం సిద్ధమైంది. వచ్చే ఏడాది మే చివరికల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత సర్పంచ్‌ల పదవీ కాలం 2018 ఆగస్టు 1వ తేదీ నాటికి ముగుస్తుంది. ఈ మేర కు షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని, డిసెంబర్ నాటికి వార్డులు, పంచాయతీల పునర్విభజన ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో 2013 జులైలో అప్పటి ప్రభుత్వం పంచాయతీలకు సాధారణ ఎన్నికలను నిర్వహించింది. ఆ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌ల పదవీ కాలం ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది.

వారి ఐదేళ్ల పదవీ కాలం 2018 ఆగస్టు 1వ తేదీతో ముగియనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఇ (3ఎ) ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ప్రస్తుత పదవీ కాలం ముగియకముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుంది. సెక్షన్ 13(2) ప్రకారం గడువు కన్నా మూడు నెలలు ముందుగానే ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారాలున్నాయి. రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు మేరకు గడువు కన్నా ముందుగానే ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. పోలింగ్ సిబ్బంది, బ్యా లెట్ బాక్సుల లభ్యత మేరకు వివిధ దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇసి నిర్ణయించింది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన యంత్రాంగాన్ని సమాయాత్తం చేసుకోవడం కోసం షెడ్యూల్ కూడా రూపొందించింది.

డిసెంబర్ కల్లా పునర్విభజన : రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, వార్డులుల పునర్విభజన ప్రక్రియను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు అవసరమైన పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, పోలింగ్ నిమిత్తం అవసరమైన సామాగ్రి రవాణా సదుపాయాలను సమకూర్చుకోవాలని కమిషనర్‌కు సూచించింది. బడ్జెట్ అంచనాలను రూపొందించి అవసరమైన మేరకు నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్‌ను కోరింది. ఎన్నికల ప్రక్రియకు సంబందించి గ్రామ పంచాయతీలో వారడుల సంఖ్యకు సమానంగా పోలింగ్ స్టేషన్లు ఉండాలని, ప్రతి వారడులో ఒక పోలింగ్ స్టేషన్ తప్పనిసరి అని పేర్కొంది. పోలింగ్ స్టేషన్ సైజును బట్టి అవసరమైన సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. 200 మంది ఓటర్లున్న పోలింగ్ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు ఒక పోలింగ్ అధికారి, 400 లోపు ఓటరలు ఉంటే ఇద్దరు, ఆ పైన ఉంటే ముగ్గురు పోలింగ్ అధికారులు తప్పనిసరి అని ఈసి స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా, డివిజన్ స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేసి తమకు నివేదిక పంపాలని సూచించింది.

Comments

comments