Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కలిసి ఉంటే కలదు ఫలం

Constructed-to-road

ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జనం కనిపిస్తారు. వారి అవసరాలకు మాత్రమే ప్రజలను ఉపయోగించుకుంటారు. రాజకీయ లబ్దికోసం .. ఓట్లకోసం.. వారు చెప్పే మాటలు వింటుంటే సమస్యలు తీర్చేందుకే పుట్టారా అన్నట్టు ఉంటాయి. మాట తీరు అమోఘం. తక్షణం నమ్మేసేలా ఉంటాయి. కాని ఓటు అనుకూలంగా పడ్డాక అసలు విషయం తెలుస్తుంది. గ్రామాల్లో, కాలనీల్లో, సమస్యలు వచ్చినప్పుడు, వ్యక్తిగత సమస్యలు చెప్పబోయినప్పుడు కనీసం మొహం చూడరు”ఈ మాటలు అంటుంది ఎవరోకాదు అస్సాంలోని నోటున్ లీకుల్ అనే గ్రామానికి చెందిన ప్రజలు.

తమ ఊరికి రోడ్డు కావాలని మూడు సంవత్సరాలుగా గవర్నమెంట్ అధికారుల ఎదుట మొత్తుకున్నా..పాలకులకు పలుమార్లు నివేదించినా ఫలితం పూజ్యం. దానితో గ్రామస్తులకు సహనం నశించింది. వీళ్ళను దేబిరించి లాభం లేదు అనుకుని తమ గ్రామానికి తామే రోడ్డు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రోడ్డు కోసం ఎవరికివారు తోచినంత డబ్బిచ్చారు. ఇంటికొకరు కూలీగా మారి గ్రామానికి రోడ్డు వేశారు. మూడు సంవత్సరాల్లో కాని పని మూడు రోజుల్లో ముందుకు కదిలింది.

గ్రామస్తుల కృషిని గౌరవించిన పాత్రికేయులు వార్తలు రాయడంతో ప్రభుత్వం స్పందించింది. రోడ్డు నిర్మాణం కోసం నిధులిచ్చింది. ఈ గ్రామానికి చాలా మంది వీదేశీ టూరిస్టులు వస్తుంటారు. పర్యాటకుల వల్ల అక్కడ ఎంతో బిజినెస్ జరుగుతోంది. కానీ ఊరికి మంచి రోడ్డు లేని కారణంగా పర్యాటకులసంఖ్య తగ్గిపోవడం మొదలుపెట్టింది. గ్రామస్తులు ప్రభుత్వంలో చలనం తెచ్చి సక్సెస్ కావడంతో మళ్ళీ అక్కడ పర్యాటకుల సందడి మొదలైంది. ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురుచూడకుండా మనకు, మన ఊరికి ఏంకావాలో అది చేసుకోవాలి. కలిసిఉంటే కలదు ఫలం.

Comments

comments