Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

కాలుష్యం వెద జల్లుతున్న కంకర మిల్లు

Village People Facing Problem With Polution in Nalgonda
చింతపల్లి : మండల పరిధిలోని వింజమూరు గ్రామపంచాయతీ పరిధిలో దేవులా తండా సమీపంలో కంకర మిల్లును కొందరు వ్యాపారస్తులు ఏర్పాటు చేసారు. ఈ కంకర మిల్లుతో పెద్ద పెద్ద రాళ్ళను కంకరగా మారుస్తారు. దీని నుండి రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే డాంబర్‌ను కూడా తయారు చేస్తారు. ఇలాంటి మిల్లులు, పరిశ్రమలు ఊరికి దూరంగా ప్రజలకు ఇబ్బంది కలగనటువంటి ప్రాంతాలలో ఇలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ నిబంధనలు తుంగలో తొక్కి అనుమతుల పేరిట ప్రజల ఆరోగ్యాలతో కంకర మిల్లు యజమానులు చెలగాటమాడుతున్నారు. దీనికి తోడు అధికారులు నిఘా కొరవడడంతో మిల్లు నిర్వాహకుల పరిస్థితి ఆడిందు ఆట పాడింద పాటగా తయారయింది. కంకర మిల్లుకు, తండాకు మధ్య దూరం కేవలం 400 మీటర్ల లోపు దూరం మాత్రమే ఉంపడడంతో పక్కనే ఉండే గిరిజన ఆశ్రమపాఠశాల విద్యార్థులు మరియు గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
ఇబ్బందులకు గురవుతున్న గిరిజనులు, విద్యార్థులు
నాగార్జునసాగర్ జాతీయ రహదరికి ఆనుకొని దేవులా తండాకు అతి సమీపంలో కంకర మిల్లును ఒందరు వ్యాపారులు ఏర్పాటు చేసారు. ఈ కంకర మిల్లు ద్వారా పెద్ద పెద్ద బండ రాళ్లను పగులగొట్టి చిన్న చిన్న రాళ్లుగా కంకరగా మారుస్తారు. ఈ బండ రాళ్లను కంకరగా మార్చే ప్రక్రియలో యంత్రాల నుండి విపరీతమైన పొగ కంకర మిల్లు నుండి చిన్న చిన్న ఇసుక రేణువులు విడుదలవుతున్నాయి. యంత్రాల నుండి విడుదలయ్యేటువంటి పొగ, ఇసుక రేణువులు, దుమ్ము, దూళి పక్కనే తండాలో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దుమ్ము, ధూళీ గాలిలో కలసి కలుషితమవడంతో ఆ గాలిని పీల్చుకోడం వల్ల ఊపిరితిత్తులపై, కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి కంకర మిల్లు వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. పగలు మొత్తం యంత్రాలు పని చేయడంతో విపరీతమైన కాలుష్యం వెదజల్లబడి తండావాసులు అనారోగ్రాల బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అనారోగ్రాల పాలయి చిన్నా చితక ఆసుపత్రుల వెంట తిరుగుతూ అనారోగ్యపరంగా, ఆర్థికంగా చాల నష్టపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారలు స్పందించి కంకర మిల్లును మూసివేయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న మిల్లు యజమానులపై చర్యలులు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు.
దేవులా తండాలో ఒక ప్రాథమిక పాఠశాల మరియు క్రషర్‌మిల్లుకు వెలకాలవైపు గిరిజన విద్యార్థులు ఆశ్రమవిద్యాలయం వున్నాయి. ప్రథమిక పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులు తమ విద్యను అభ్యసిస్తుండగా పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాలలో వివిద ప్రాంతాలకు చెందిన 400 మంది విద్యార్థులు తమ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ కంకర మిల్లు నుండి నిత్యం డాంబర్‌ను తయారు చేస్తుండడంతో విపరీతమైన కాలుష్యం వెలువుడుతుంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కాలుష్య సహితమైన గాలిని పీల్చుకోవడం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురి అవుతున్నారు.
పాడవుతున్న పంటపొలాలు
క్రషర్ మిల్లుకు ఆనుకొని గిరిజనుల పంటపొలాలు ఉన్నాయి. పంట పొలాల మధ్య కంకరమిల్లు ఉండడంతో ఈ మిల్లు నుండి విడుదలవుతున్న దుమ్ము, ధూళి వల్ల పంట పొలాలు నాశనమవుతున్నాయిని గిరిజనులు వాపోతున్నారు. రేయింబవలు కుటుంభం మొత్తం కష్టపడి పంటలను సాగుచేస్తారు. అప్పుసప్పు చేసి వేల రూపాయల పెట్టుబడి పంటలపై పెట్టి పంట దిగుమతి వస్తే బతుకులు కొంతవరకైనా బాగుపడుతాయని గిరిజనులు కలలుకంటున్న సందర్భంలో ఈ మిల్లు ద్వారా వచ్చే దుమ్ము, ధూళీ వల్ల పంటలు నాశనమవుతున్నాయని గిజనులు వాపోతున్నారు.
వాహనదారులకు తప్పని ఇక్కట్లు
క్రషర్ మిల్లు జాతీయ రహదారి పక్కనే ఉంపడడంతో ఆ రహదారి వెంట నిత్యం వేల వహనాలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ మిల్లు పక్కనే రహదారి మూలమలుపు ఉండడంతో ఈ ప్రాంతంలో ఇప్పటికే ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి. క్రషర్ మిల్లు నుంచి వచ్చే దుమ్ము, ధూళీ బైక్‌లు, ఆటో ఇతర వాహనచోదకుల కళ్లలో పడి తీవ్ర ఇబ్బందులకు గురయి ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటన్నీటిని అధికారులు దృష్టిలో ఉంచుకొని కంకరమిల్లును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

comments