Search
Sunday 22 July 2018
  • :
  • :

పల్లె సూడని బస్సులు…!

Villagers Demond To Start RTC Bus Come to Their Villages

కొడంగల్‌రూరల్‌ః జిల్లాలోనే మారుమూల నియోజకవర్గం. కర్నాటక సరిహద్దులో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సు సూడని గ్రామాలు ఎన్నో…. స్వయాన రాష్ట్ర రవాణ శాఖా మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే ఈ దుస్తితి ఉండడం గమనార్హం. సరైన రవాణా సౌకర్యం లేక గ్రామీణులు నేటికి ఆటోలు ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇక చదువుకునే విద్యార్ధుల పరిస్థితి మరి దారుణం. పై చదువుల కోసం ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే  విద్యార్ధులు కాలినడకన లేదా ఆటోల్లో వెళుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని మూడు (కొడంగల్,దౌల్తాబాద్,బొంరాస్‌పేట)మండలాల్లోని అనేక గ్రామాల్లో నేటికి ఆర్టీసీ బస్సు నడిచిన దాఖలాలు లేవు. కొడంగల్ మండలంలో మొత్తం 44గ్రామాలు,తాండాలు ఉండగా ,దౌల్తాబాద్‌లో 61,బొంరాస్‌పేటలో 96 ఉన్నాయి. ఈ మూడు మండలాల్లో కేవలం 45శాతం గ్రామాలకే బస్సు సౌకర్యం ఉంది. ఉన్న బస్సులు కూడా ఉదయం,సాయంత్రం మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయి. దింతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పడం లేదు. ప్రైవేటు వాహనాల గురించి కొత్తగా చెప్పేది లేదు. వచ్చి రానోళ్ళంతా డ్రైవర్లె, స్టిరింగు కూడా సరిగా పట్టుకోనికే రానోడు కూడా ఆటో నిండా మందితో రోడ్ల మీద చక్కర్లు కోడుతు ప్రమాదాలకు కారకులవుతున్నారు. కొన్ని తప్ప దాదాపు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్న ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపేందకు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కర్నాటక సరిహద్దులో ఉండడంతో ఆ రాష్ట్ర బస్సులు ఈ ప్రాంతంలో అత్యాధికంగా వసుళ్ళు రాబట్టుకుంటున్నాయి. ఇకనైన అధికారులు దృష్టి సారించి బస్సులు నడిపితే సంస్థ కూడా లాభాల బాటలో నడుస్తుందని ప్రజలు అంటున్నారు.
మీని డిపో ఏర్పాటు చేయాలి…..
కొడంగల్ పేరుకే నియోజకవ్గ కేంద్రం కాని అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. హైద్రాబాద్‌కు 100కిలోమిటర్ల దూరంలో మాత్రమే ఉన్నా టైం దాటితే బస్సులు ఉండవు. ఈ ప్రాంతంలో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి తరచు పర్యాటించిన ఇక్కడి వారి సమస్యలు మాత్రం తీరడం లేదు. ప్రధాన నగారాలకు కేంద్రంగా ఉన్న కొడంగల్‌లో మిని బస్ డిపోను ఏర్పాటు చేయాలి.
నందారం రాజేందర్,టిడిపి నాయకులు,కొడంగల్
స్కూలుకు పోతే 10రూపాయలు కావాలే…..
మా ఊర్లో ఉన్నత పాఠశాల లేదు. ఐదు కిలోమిటర్లు దూరంలో ఉన్న కొడంగల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. పాఠశాలకు పోవాలంటే ఆటోలో పోతాం. రాను పోను 10రూపాయలు కావాలే. నుడుచుకుంటు పాఠశాలకు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అనూషా,విధ్యార్ధిని,ఐనన్‌పల్లి
ఆటోలే దిక్కు…..
హైద్రాబాద్-బీజాపూర్ అంతర్ రాష్ట్ర రహదారికి కిలోమిటరు దురంలో మా గ్రామం ఉంటాది. ఇంత వరకు బస్సు వచ్చిన దాఖలాలు లేవు. మాకు ఏ పని ఉన్న ఆటోల్లోనే పోతుంటాం.
లక్ష్మారెడ్డి,గ్రామస్తుడు,ఐనన్‌పల్లి

Comments

comments