Search
Sunday 18 November 2018
  • :
  • :

వానర సైన్యంతో జనం బెంబేలు

Villagers Face Problems With  Monkeys in Arvapally

అర్వపల్లి(నాగారం):నాగారం, అర్వపల్లి మండల కేంద్రంలో, పరిధిలోని వివిధ గ్రామాల్లో కోతుల బెదడ రోజు రోజుకు పెరిపోతోంది. ఇళ్లలోకి ప్రవేశించి తినే వస్తువు కనబడితే చాలు ఎత్తుకెళ్తున్నాయి. దీనికి తోడు మనుషుల పై దాడులకు పాల్పడుతూ గాయ పర్చుతున్నాయి. దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్ధులు, వాహనదారులు, గృహల్లోని మహిళాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతులు ఇళ్ల చుట్టూనే సంచరిస్తూ ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. కోతులు రోడ్ల వెంట, గృహాల్లో గుంపులు, గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వ్యవసాయ బావుల వద్ద వరి పంటలను, కూరగాయాల తోటలను , పండ్ల మొక్కలను తినేస్తున్నాయి. ఇళ్ల వద్ద పండ్ల చెట్లను, కూరగాయాలను మొక్కలను, చింత చెట్లకు ఉన్న చింతకాయాలను ఎక్కడికక్కడే పీకి పడేస్తూ ప్రజలకు, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెదడతో పంటలను, కూరగాయల సాగును రక్షించుకోలేక పోతున్నామని పలువురు రైతులు వాపోతున్నారు. అలాగే పంట చేల వద్ద రైతులు, గృహాల వద్ద మహిళలు పొద్దస్తామనం కోతులకు కాపాలా ఉండాల్సిన పరిస్ధితి నెలకొందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Comments

comments