Search
Wednesday 21 November 2018
  • :
  • :

గిరిపుత్రుల నీళ్ల కష్టాలు..

villagers Facing Drinking Water Problems
కౌడిపల్లి : అధికారుల నిర్లక్షం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో గిరిజన తండాలలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గత రెండు నెలల నుండి ఎండలు మండడంతో తాగునీటికి గిరిజనులు నానా తంటాలు పడుతున్నారు. మండల పరిధిలోని శేరితాండ, లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బిట్లతండలలో గిరిపుత్రులు తాగునీటికై నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నా ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ ఏ ఒక్కరు పట్టించుకున్న పాపానా పోలేదని వారు కాలీ బిందెలతో ఎంపిడివో కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తాగునీటి కోసం దూరంగా ఉన్న వ్యవసాయ బోరుబావుల నుండి నీటిని తెస్తున్నామని, రోజంతా నీటి కోసమే తమ పనులు వదులుకోవాల్సి వస్తుందని, పట్టించుకోవాల్సిన పాలకవర్గంమే పట్టించుకోకపోవడంతో తండాలో నీటి ఎద్దడి మొదలైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే నీటి సమస్యను పరిష్కరించకుంటే మరింత ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఎంపిడివో కరుణశీల, ఎఇ చిన్నినాయక్‌లు నీటి సమస్యను తీరుస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బిట్లతాండకు చెందిన గిరిజన మహిళలు పాల్గొన్నారు.

Comments

comments