Search
Friday 16 November 2018
  • :
  • :

అధికారుల నిర్లక్ష్యం…దళితులకు శాపం

Dalits

2001లో ఆ ఊరి దళిత జనాభా 318
2011లో ఆ ఊరి దళిత జనాభా 04
ఆరేళ్లుగా ఆ ఊరి కందని ఎస్‌సి సబ్ ప్లాన్ నిధులు
గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో అవకాశం కోల్పోయిన దళితులు
అధికారుల చుట్టు తిరుగుతున్నా జరగని పని
ప్రజావాణిలో కలెక్టర్‌కు తమ గోడు వెళ్లబోసుకున్న బాధితులు

మనతెలంగాణ/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 20కి. మీటర్లు, మండల కేంద్రమైన దర్మారానికి 10 కి .మీటర్ల దూరంలో గల ఆ ఊరి పేరు ఖిలా వనపర్తి . అధికారులు చేసిన నిర్లక్ష్యం ఆ ఊరి గ్రామ దళితులకు శాపంగా పరిణమించింది. తప్పుడు లెక్కలు ఆ ఊరి లోని 100 దళిత కుటుంబాలకు తీరని అన్యాయం చేసింది. అధికారులు ఒత్తిడితో చేసిన, పొరపాటుగా చేసిన శిక్షను మాత్రం ఆ గ్రామ దళితులు గత ఆరేళ్లుగా అనుభవిస్తున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఆ ఊరి దళిత జనాభా 318. అందులో పురుషులు 163 కాగా 155మంది మహిళలు. అదే 2011 జనాభా లెక్కల కొచ్చే సరికి ఆ ఊరి దళిత జనాభా 04 పడి పోయింది.

అందులో 01 పురుషులు కాగా 03 మ హిళలుగా అధికారులు నమోదు చేశారు . పదేళ్లలో కనీసం 25 శాతానికి పైగా పెరగాల్సిన జనాభా 01 శా తానికి పడిపోయింది. ఫలితంగా గత ఆరేళ్లుగా ఆ ఊరికి రావలసిన ఎస్‌సి సబ్ ప్లాన్ నిధులు రాకుండా పోయాయి . జనాభా ప్రాతిపాదికన రొటేశన్ పద్దతిలో ఆ ఊరి దళితులకు చెందాల్సిన సర్పంచ్ పదవి గడిచిన ఎన్నికల్లో చేజారి పోయింది . ఆరేళ్లుగా ఎక్కని ప్రభుత్వ ఆఫీసు మెట్టు లేదు, కలవని ప్రజాపతినిధి లేడు , అయినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని 2021 లో తిరిగి నిర్వహించే జనాభా గణనలో మాత్రమే సరిది ద్దుతామని అధికారులు చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇకనైనా తమ సమస్యను పరిష్కారించాలని సొమవారం జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు .

అధికారులు న్యాయం చేయాలి
అధికారులు చేసిన తప్పిదానికి తాము గత ఆరేళ్లుగా శిక్షను అ నువిస్తున్నామనిఖిలావనపర్తి గ్రామాని చెందిన వారు వార్డు సభ్యుడు మద్దనాల వెంకటేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .అ ధికారుల చుట్టూ, ప్రజా ప్రతిని ధుల చుట్టూ తిరిగినా పట్టించు కోవడం లేదని ఆరోపించారు .2001లో 318గా ఉన్న ఖిలా వనపర్తి దళిత జనాభా పదేళ్లలో పెరగాల్సింది పో యి, ౦4 కు ఎలా తగ్గుతుందని ఆయన ప్రశ్నించారు .జిల్లా కలెక్టర్ గ్రామ దళితులకు జరుగుతున్న అన్యా యం పై ప్రభుత్వానికి నివేదించి, తగు నిర్ణయం తీ సుకోవాలని కోరారు. -మద్దనాల వెంకటేశం

ఆరేళ్లుగా సబ్ ప్లాన్ నిధులు ఆగిపోయాయి
జనాభా గణాంక అధికారులు చేసిన పొరపాటు వలన ఖిలా వనపర్తి గ్రామానికి రావ లసిన ఎస్‌సి సబ్ ప్లాన్ నిధులు గడిచిన ఆరేళ్లుగా ఆగి పోయా యని గ్రామానికి చెందిన దళి త యువకుడు రమేశ్ ఆరో పించారు.
సర్పంచ్ ఎన్నికలకు ముం దు తాము రెవెన్యూ అధికారుల ను కలిసి గ్రామంలో తిరిగి జనా భా లెక్కలను చేయా లని విన్నవించామని ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు . 2021 లో తిరిగి నిర్వహించే జనాభా గణనలో మాత్రమే సరిది ద్దుతామని అధికా రులు చెబుతున్నారని ఆరోపించారు.  – రమేశ్ గ్రామస్తుడు

సర్పంచ్ పదవి చేజారింది
జనాభా ప్రాతిపాదికన రొటేశ న్ పద్దతిలో దళితులకు చెందా ల్సిన సర్పంచ్ పదవి గడిచిన ఎన్నికల్లో చేజారి పోయిందని కాశిపాక శ్రీనివాస్ అనే దళిత యువకుడు రోపించారు. అధికారులు ఎవరి ప్రమే యంతో తప్పిదం చేసినా , తామూ ఎవరిని నిందించడం లేదని, జరిగిన పొరపా టును సరిదిద్దమని మాత్రమే అడుగుతున్నామని ఆ యన అన్నారు. ప్రభుత్వం తిరిగి తమ గ్రామంలో జనా భా గణాంకన నిర్వహించి తమకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. -కాశిపాక శ్రీనివాస్

Comments

comments