Search
Tuesday 20 November 2018
  • :
  • :

తాగునీటి కోసం తంటాలు..ఖాళీ బిందెలతో నిరసన

Villagers Strike For Drinking Water Nizamabad

లింగంపేట: గత వారం రోజులుగా తాగు నీరు సరఫరా చేయడం లేదంటు రెండు కాలనీల ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన తెలిపిన సంఘటన లింగంపేట మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మండల కేంద్రమైన లింగంపేటలోని 6,7 వార్డులలో గత వారం రోజులుగా గ్రామ పంచాయతీ పాలకులు తాగు నీటిని సరఫరా చేయడం లేదని, దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనీ వారు ఖాళీ బిందులతో రహదారిపై బైఠాయించారు. ప్రజలకు తాగునీటిని అందించడంలో గ్రామ సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని వారు ఆరోపించారు. సుమారు గంట సేపు నిరసన తెలిపారు. తాగు నీటిని సరఫరా చేయాలని పలుమార్లు అభ్యర్ధించిన గ్రామ పంచాయతీ పాలకులు కానీ అధికారులు గాని స్పందించడం లేదనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ఇతర కాలనీలలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా మా రెండు కాలనీలలో ఎందుకు సరఫరా చేయడం లేదనీ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మోహన్, ప్రవీణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments