Home సినిమా నువ్వు పందెం పరశురామ్ అయితే… ఇక్కడ రామ్ కొణిదెల

నువ్వు పందెం పరశురామ్ అయితే… ఇక్కడ రామ్ కొణిదెల

Ram-Charan

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ రానే వచ్చింది. స్టార్ హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వినయ విధేయ రామ’ టీజర్ విడుదలైంది. ఈ ఈ కాంబినేషన్‌కు తగ్గట్టే ఇది ఊర మాస్ సినిమా అని టీజర్ చూస్తే అర్థమైంది. 49 సెకన్ల టీజర్‌లో పూర్తిగా హీరో మీదే దృష్టిపెట్టారు బోయపాటి. ప్రతి షాట్‌లోనూ మాస్ హీరోయిజమే కనిపించింది. టీజర్‌లో స్టోరీలైన్ ఏమిటన్నది తెలియజేయలేదు. అయితే అరాచకాలు చేసే ఒక బలవంతుడైన విలన్‌ను హీరో ఢీకొట్టడం అనే బోయపాటి మార్క్ లైన్‌లోనే సినిమా సాగుతుందని తెలిసింది. “అన్నాయ్ వీన్ని చంపేయాలా భయపెట్టాలా… భయపెట్టడానికైతే పది నిమిషాలు, చంపేయాలంటే పావు గంట. ఏదైనా ఓకే… సెలెక్ట్ చేసుకో” అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. టీజర్ ప్రారంభంలోనే ఆయుధం పట్టి రంగంలోకి దిగిపోయారు రామ్‌చరణ్. ఆతర్వాత మరికొన్ని రకాల ఆయుధాలతో విలన్ల మీదకు దూసుకెళ్లారు. టీజర్‌లో హీరో చరణ్, విలన్ వివేక్ ఒబెరాయ్ తప్ప ఇతర పాపులర్ నటులు కనిపించలేదు. టీజర్‌లో ఫినిషింగ్ టచ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. “రేయ్ నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంట్రా… ఇక్కడ రామ్ కొణిదెల” అంటూ చరణ్ తన సొంత పేరు, ఇంటి పేరును మాస్ స్టయిల్‌లో చెప్పడం విశేషం. మెగా ఫ్యామిలీలో ఇప్పటిదాకా ఎవ్వరూ నేరుగా ఇంటి పేరును సినిమాలో పెట్టుకున్నది లేదు. ఇక చరణ్, బోయపాటి క్రేజీ కాంబినేషన్‌కు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది.

vinaya vidheya rama movie teaser released 

Telangana News