Home తాజా వార్తలు ‘వివిఆర్’ ట్విట్టర్ టాక్..!

‘వివిఆర్’ ట్విట్టర్ టాక్..!

Vinaya Vidheya Ramaమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. కాగా, ట్విట్టర్ లో మాత్రం సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత చరణ్ నటించిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా టీజర్, ట్రైలర్ లను వదిలింది చిత్ర యూనిట్. కానీ ఆ అంచనాలను సినిమా అంతగా అందుకోలేకపోయిందనే టాక్ వస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని… ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజ్ లో ఉందని చెబుతున్నారు. అలాగే చెర్రీ డ్యాన్స్, ఫైట్స్ ఇరగదీశాడంటున్నారు. సెంటిమెంట్, కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ బాగా హ్యాండిల్ చేయడంతో పాటు బోయపాటి మార్క్ యాక్షన్ సినిమాగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అయితే, దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదనే కామెంట్లు వస్తున్నాయి. ఇక కెమెరా పనితనం సినిమా మొత్తానికి హైలెట్ గా ఉందట. కుటుంబాన్ని కంటికి రెప్పలా కథానాయకుడు ఎలా కాపాడుకున్నాడు? అలాగే తన బాధ్యతను ఎలా నిర్వర్తించాడు అనే అంశాలు బావున్నప్పటికి కథలో కొత్తదనం లేకపోవడం ‘వివిఆర్’ మైనస్ పాయింట్ అని చెబుతున్నారు. ఈ మూవీ బి, సి సెంటర్ ఆడియన్స్ ను మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

Vinaya Vidheya Rama Movie Twitter Talk Out now