Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘వినయ విధేయ రామ’ టీజర్

Vinaya Vidheya Rama Teaser

హైదరాబాద్: మెగా పవర్‌స్టార్  రామ్‌చరణ్, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ‘వినయ విధేయ రామ’ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. టీజర్ లో బోయపాటి తన మాస్ డోస్ ను ఈసారి ఇంకొంచెం పెంచాడు. చెర్రీని మరింత పవర్ ఫుల్ మాస్ పాత్రలో చూపించాడు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దానయ్య డి.వి.వి. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే చరణ్ ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటిస్తున్న మూవీ కావడంతో ‘వివిఆర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Vinaya Vidheya Rama Teaser is Released

Comments

comments