Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

వినాయక చవితికి ‘ధృవ’ ఫస్ట్‌లుక్ టీజర్

Dhruvaస్టార్ హీరో రామ్‌చరణ్ తాజా చిత్రం ‘ధృవ’ షూటింగ్ జెట్‌స్పీడ్‌తో కొనసాగుతోంది. వారం రోజుల్లో సినిమా టాకీ పార్ట్ షూటింగ్‌ను ముగించబోతున్నారు ఫిల్మ్‌మేకర్స్. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి దసరా పండుగ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో అల్లుఅర్జున్ ఓ చిన్న కేమియో రోల్‌లో నటిస్తాడని తెలిసింది. కానీ ఇంతవరకు ఈ విషయమై ఫిల్మ్‌మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తమిళ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘తని ఒరువన్’ రీమేక్‌గా ‘ధృవ’ తెరకెక్కుతోంది. ‘రేసుగుర్రం’ ఫేమ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సినిమా రూపుదిద్దుకుంటోంది. బ్రూస్‌లీ చిత్రం తర్వాత మరోసారి ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్… చరణ్‌తో రొమాన్స్ చేస్తోంది. అల్లు అరవింద్, ఎన్‌వి ప్రసాద్‌లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై రామ్‌చరణ్, సురేందర్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ద్వయం హిప్‌హాప్ తమిజ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా పాటలకు సంగీతాన్ని సమకూర్చారు. ఫైనల్ మిక్సింగ్ మాత్రమే మిగిలిపోయింది. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. వినాయక చవితి స్పెషల్‌గా ఈనెల 5న ఫస్ట్‌లుక్ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి భారీగా బిజినెస్ జరుగుతోంది. ‘ధృవ’ చిత్రం సీడెడ్ రైట్స్‌ను 9 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం.

Comments

comments