Search
Sunday 23 September 2018
  • :
  • :

వినాయకచవితి శుభాకాంక్షలు

                    KCR-vs-Narasimhan

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.  ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడాలని, అన్ని పథకాల ప్రయోజనాలు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని కెసిఆర్ ఆకాంక్షించారు.  ఖైరతాబాద్ గణేషుడి వద్ద గవర్నర్ నరసింహన్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారని గవర్నర్ తెలిపారు. విఘ్నాలు కలగకుండా ప్రజలు సంతోషంగా ఉండేలా చూడాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో గణేష్ విగ్రహం 27 అడుగులు ఉంది. చండీకుమార మహాగణపతి అవతారంలో ఖైరతాబాద్ గణేషుడు కొలువుదీరాడు.

Comments

comments