Home జిల్లాలు నిమజ్జనం షురూ!

నిమజ్జనం షురూ!

Untitled-1సిటీబ్యూరో ః గ్రేటర్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం షురువైంది. ప్రతి సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం అత్యంత వైభవోపేతంగా ప్రజలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా నగరంలో పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేశా రు. నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహిం చేందుకు జిహెచ్‌ఎంసి, నీటిపారుదల శాఖ, హెచ్‌ఎండిఎ, పోలీస్ తదితర ప్రభు త్వ శాఖలు సన్నాహాలు పూర్తి చేశాయి. శనివారం ట్యాంక్‌బండ్ దగ్గర నీటిపారు దల శాఖ మంత్రి టి.హరీష్‌రావు లాం ఛనంగా నిమజ్జనోత్సవాన్ని ప్రారంభిం చారు. ముందుగా ఆయన వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిమజ్జనానికి ముందే నిండిన చెరువులు
ఎలాంటి విఘ్నం లేకుండా రాష్ట్రంలోని చెరువులన్నీ నిండాలని దిల్‌షుఖ్‌నగర్: మినీ ట్యాంక్‌బండ్‌గా పేరుగాంచిన సరూర్‌నగర్ చెరువులో శనివారం మూడో రోజు నిమజ్జ్జనాన్ని అధికారులు ప్రారం భించారు. మూడు భారీ క్రేన్‌లతో నిమజ్జనానికి తరలివచ్చిన గణనాథులను చెరువులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు ట్రాక్‌పై ఎలాంటి చెత్తచెదారం లేకుండా చూస్తున్నారు.
నాగోల్‌లో
గణేష్ ఉత్సవాలలో భాగంగా కొత్తపేట్ మోహన్ నగర్‌లోని రాఘవేంద్రకాలనీలో శ్రీ సిద్ది వినాయక ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడికి శనివారం ఘనమైన పూజలు అందుకున్నాడు.
చర్లపల్లిలో
చర్లపల్లి డివిజన్ పరిదిలోని పెద్ద చర్లపల్లి చిన్న చర్లపల్లి, మింట్‌కాలనీ, ఈసినగర్, భరత్‌నగర్ తదితర ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తిశ్రధ్దలతో పూజిస్తున్నారు. పారిశ్రా మికవాడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణనాథుడికి టిఆర్‌ఎస్ నాయకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రాజేశ్వర్‌రెడ్డి, బాల్‌నర్సింహా ఉన్నారు.
ఎల్బీనగర్‌లో
వినాయక చవితి నవరాత్సోవల్లో మూడో రోజు గణనాధులను ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ వినాయక మండపాల్లో అన్నదానాలు, సంగీతలహారి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఉప్పల్‌లో
ఉప్పల్‌లోని గాంధీబొమ్మ వద్ద ప్రతిష్టించిన అతి పెద్ద వినాయకుడు గణేశ్ ఉత్సవ కమిటి అధ్వర్యంలో నిత్యం పూజలు, రాత్రి సమయాల్లో భజనలు పెద్ద ఎత్తున గత నాలుగురోజులుగా నిర్వహిస్తున్నారు. అనంతరం శనివారం అన్నదానం చేశారు.
రామంతాపూర్‌లో
ఉప్పల్ గాంధీబొమ్మ వద్ద ప్రతిష్టించిన బారీ గణానాథుడికి రామంతాపూర్‌కు చెందిన పలువురు టిఆర్‌ఎస్ నా యకులు తవిడబోయిన గిరిబాబు ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుడిని దర్శించుకున్నవారిలో వంగాల సతీష్, సురేష్, సత్యనారాయణ, టి.రాజ్‌కుమార్ జేట్ట జ్ఞానేశ్వర్, రాజు, గణేష్ ఉన్నారు.