Home ఆఫ్ బీట్ విఘ్నేశ్వరుని పూజా ద్రవ్యాలు

విఘ్నేశ్వరుని పూజా ద్రవ్యాలు

Vinayaka-Chavithi

* వినాయక మట్టిప్రతిమ
* గంథం
* పసుపు
* అక్షతలు
* వత్తులు
* కుంకుమ
* బియ్యం
* అగ్గిపెట్టె
* రెండు దీపపు కుందులు
* వినాయక వ్రతకల్ప పుస్తకం
* జేగంట 12 అగరుబత్తీలు, ఆవునెయ్యి లేదా కొబ్బరినూనె (దీపారాధనకు)
* ఆచమన పాత్రలు (గ్లాసులు), * మూడు ఉద్ధరిణలు (స్పూన్లు)
* చేతులు కడుక్కోవడానికి, ఆచమనాదుల కోసం చిన్న పళ్లెం
* నైవేద్యానికి , పూలు, పత్రి పెట్టుకోవడానికి మూడు పళ్లాలు, హారతి పళ్లెం
* కర్పూరం
* రెండు కొబ్బరికాయలు, * తీర్థం పట్టడానికి గ్లాసు
* అరటిపళ్లు, వెలగపళ్లతో పాటు నైవేద్యానికి ఇతర పళ్లు
* వివిధ రకాల పుష్పాలు, పూలమాలలు
21 రకాల పత్రి
* తమలపాకులు, 24 వక్కలు
* రెండు యజ్ఞోపవీతాలు ( పత్తిని సన్నని దారంగా చేసి మధ్యమధ్యలో పసుపు కుంకుమలను అద్దితే యజ్ఞోపవీతాలు సిద్ధం)
* రెండు రవికముక్కలు లేదా కండువాలు ( లేదా రూపాయి బిళ్లంతటి పరిమాణంలో దూదిని తీసుకుని తడిపి దానికి కుంకుమ అద్దితే అవి కూడా వస్త్రాలతో సమానం)
* మధుపర్కం (చిన్న గిన్నెలో తేనె, పెరుగు, నెయ్యి, చెరకు రసం కలిపిన మిశ్రమం)
* రెండు జతల తాంబూలాలు (5 తమలపాకుల్లో రెండు వక్కలు, 2 అరటి పళ్లు, రూపాయి దక్షిణ చొప్పున)
* పంచామృతం (ఆవుపాలు,ఆవుపెరుగు,ఆవునెయ్యి,చెరుకు రసం కలిపిన మిశ్రమం)

Maha-Ganapathi9

పాలవెల్లి
* పాలవెల్లికి అలంకరించేందుకు కాడలున్న కాయలు, పళ్లు (కనీసం 9)
* నైవేద్యం (బెల్లం ముక్కలు, 21 ఉండ్రాళ్లు లేదా కుడుములు లేదా మోదకాలు, ఇవేగాక అప్పాలు, అటుకులు, లడ్డూలు, పరమాన్నం, పానకం, ఇంకా మీ యథాశక్తిగా నైవేద్యం సిద్ధం చేసుకోవచ్చు.)
పాలవెల్లి అలంకరణ

ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి దేవుడి గదిలో లేదా ఇంటిలోని ఈశాన్యమూల స్థలాన్ని శుద్ధిచేసి గోమయంతో కానీ, పసుపుతో కానీ అలకాలి. బియ్యపుపిండితో లేదా రంగులతో ముగ్గులు వేయాలి. ఆసనం కోసం ఒకపీట లేదా మంటపం ఏర్పాటు చేయాలి. పీట పైభాగాన పళ్లూ కాయలూ కట్టిన పాలవెల్లిని పందిరిగా అలంకరించాలి. పీటను అలంకరించి దానిపై బియ్యం పోసి మట్టివినాయక ప్రతిమను ఉంచాలి.
మహాగణపతి పూజ

వ్రతకల్పం నిర్విఘ్నంగా జరగాలి, మీ మనోసంకల్పం నెరవేరాలని కోరుకోవాలి. మంటపం ఎదురుగా పీటవేసుకుని దంపతులు కూర్చోవాలి. భర్తకు ఎడమవైపు భార్య కూర్చోవాలి. పిల్లలు ఎలాగైనా కూర్చోవచ్చు. దంపతుల మధ్య మాత్రం కూర్చోకూడదు. ముందస్తుగా పసుపును తడిపి మహాగణపతిని తయారుచేసుకోవాలి. ఉద్వాసన వరకు పసుపు గణపతికే పూజలు చేయాలి. ఆ తర్వాతనే మట్టిగణపతికి పూజలు చేయాల్సి ఉంటుంది. రెండుచేతులూ జోడించి కింది శ్లోకం చదవాలి.

Ganapathy

శ్లోకం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే
తదేవలగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతే తేంఘ్రియుగ్మం స్మరామి
యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళామ్
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్.

ప్రార్థన

కింది శ్లోకం చదువుతూ…. బొటనవేలు, ఉంగరంవేలు, మధ్యవేళ్లతో అక్షంతలు తీసుకుని పసుపు గణపతిపై వేసి నమస్కరించాలి.
సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుః గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే.
దీపారాధన

కింది శ్లోకాన్ని చదువుతూ అగరుబత్తితో కానీ మరో చిన్న దీపంతో కానీ దీపాలను వెలిగించాలి. దీపాల వద్ద పూలు, అక్షంతలు ఉంచి నమస్కరించాలి.
భో దీపదేవీ రూపస్తం కర్మసాక్షి హ్యామిఘ్నకృత్
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ
దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు

ఆచమనం

ఆచమన పాత్ర (గ్లాసు)లోని నీళ్లను ఉద్ధరిణ (స్పూను) తో కుడిచేతిలోకి తీసుకుని చప్పుడు కాకుండా కింది పెదవితో స్వీకరించాలి. ఇలా మొదటి మూడు నామాలకూ చేయాలి.
ఓం కేశవాయ స్వాహా ( స్త్రీలైతే స్వాహా బదులుగా నమః అనాలి)
ఓం నారాయణాయ స్వాహా (నమః), ఓం మాధవాయ స్వాహా (నమః) ఉద్ధరిణతో మరోసారి నీళ్లు తీసుకుని కుడిచేతిని కడుక్కుని, వస్త్రంతో తుడుచుకోవాలి. తరువాత కిందనున్న మిగతా నామాలు చదవాలి.
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీ కేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః

భూతోచ్ఛాటన

కింది శోక్లాన్ని చదువుతూ అక్షంతలు వాసన చూసి భార్య ఎడమచేతి పక్క నుంచి వెనక్కు వేయాలి. ప్రతంలో పాల్గొంటున్న ఇతరులు కుడిచేతి పక్క నుంచి వెనక్కు అక్షంతలు వేసుకోవాలి.
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషామమిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ప్రాణాయామం

మనస్సును ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీశుద్ధికి చేసేదే ప్రాణాయామం. ముక్కుపై మధ్యవేలు, బొటనవేలు ఉంచుకుని కింది శ్లోకాన్ని పఠించాలి.
ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్.

సంకల్పం

చేతిలో అక్షంతలు తీసుకుని మనసులోనే స్వామివారికి మీ కోరికను నివేదించుకుని, సకుటంబ సపరివారంగా సంకల్పం చెప్పుకోవాలి. ఒకరు చెబుతుంటే మిగతావారు అనవచ్చు.
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞేయా ప్రవర్తమానస్య
అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూద్వీపే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య….. (హైదరాబాద్ ప్రాంతవాసులు వాయవ్యప్రదేశే అని, తిరుపతి ప్రాంతవాసులు ఆగ్నేయ ప్రదేశే అని, విజయవాడ, విశాఖ వాసులు ఈశాన్యప్రదేశే అని చెప్పుకోవాలి)
కృష్ణా గోదావర్యోః మధ్యదేశే స్వగృహే ( సొంతిల్లు కానివారు లక్ష్మీనివాస గృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీవిళంబి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షరుతౌ, భాద్రపదమాసే,శుక్లపక్షే, స్వాతి నక్షత్ర ప్రయుక్త చతుర్ధాం తిథౌ, బృహస్పతివాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ , శ్రీమాన్ శ్రీమతః
…….గోత్రః…… (ఎవరికి వారు గోత్రం చెప్పుకోవాలి) నామధేయః ……..(కుటుంబ పెద్దపేరు మాత్రం చెబితే చాలు), గోత్రోద్భవస్య…….. నామధేయస్య (తిరిగి గోత్రం చెప్పుకుని వినాయక వ్రతంలో పాల్గొంటున్నవారితో పాటు కుటుంబసభ్యులందరి పేర్లనూ చెప్పుకోవచ్చు), ధర్మపత్నీ సమేతస్య (వివాహమైన వారు మాత్రమే చదవాలి) మమ సహకుటుంబస్య, సబాంధవస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ మంగళావాప్తర్ధం, వర్షేవర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవతా ముద్దిస్య వర్షేవర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త ప్రకారేణ అంటూ అక్షంతలు, నీళ్లూ పళ్లెంలో వదలాలి.

కలశపూజ

ఆచమనం కోసం వాడిన పాత్ర కాకుండా మరో ఆచమన పాత్ర (గ్లాసు)ను కలశపూజ కోసం వినియోగించాలి. కింది శ్లోకాన్ని చదువుతూ కలశాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించాలి.
ఆదౌ నిర్వఘ్నేన పరిసమాప్తర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే
తదంగ కలాశారాధనం కరిష్యే
కలశంపై కుడిచేతిని ఉంచి కింది శ్లోకాన్ని చెప్పాలి.
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సయాశ్రితః
మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరాః
కలశంలోని నీటిని తమలపాకుతో తిప్పుతూ ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
కింది శ్లోకం చదువుతూ కలశంలోని నీటిని తమలపాకుతో తీసుకుని వినాయకుడి మీద, పూజాద్రవ్యాలపైన, పూజచేస్తున్నవారి పైన, కుటుంబసభ్యులపైన చిలకరించాలి.

Ganesha Chaturthi : Vinayaka chavithi Festival Celebrations

ఆయాంతు శ్రీగణపతి పూజార్ధం దురితక్షయ కారకాః
కలశోదకేన దేవం పూజాద్రవ్యాణి చ సంప్రోక్ష
ఏవమాత్యానంచ సంప్రోక్ష
మహాగణపతి ప్రాణప్రతిష్ఠ

కింది శ్లోకాన్ని చదువుతూ పసుపు గణపతిపై అక్షతలు వేసి నమస్కరించాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమోనమః
ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః సుముహూర్తోస్తు
స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు.

మహాగణపతి పూజ

Vinayaka (25)

కింది శ్లోకాన్ని చదువుతూ రెండు చేతుల్లోనూ పూలు తీసుకుని పసుపు గణపతికి అర్పించి నమస్కరించాలి.
గణానాంత్వా గణపతిగం హవామహే కవిం కవీనా ముపమశ్రవః స్తవమ్ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతిభిస్సీద సాధనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
ఆవాహనం
శ్రీమహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి
స్వామిపై నీటిని చిలకరించాలి.
రత్నసింహాసనం
శ్రీమహాగణాధిపతయే నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి
స్వామిపై పువ్వులు ఉంచాలి.
అర్ఘం
శ్రీమహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘం సమర్పయామి
పసుపు గణపతిపై నీటిని చిలకరించాలి.
పాద్యం
శ్రీమహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి
స్వామిపై నీటిని చిలకరించాలి.
ఆచమనీయం
శ్రీమహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి
స్వామిపై నీటిని చిలకరించాలి.
ఉపచారపూర్వక స్నానం
శ్రీమహాగణాధిపతయే నమః ఉపచారికాస్నానం సమర్పయామి
ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని కొద్దిగా పసుపు గణపతిపై చిలకరించాలి.
శుద్ధోదక స్నానం
శ్రీమహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి
స్వామిపై నీటిని చిలకరించాలి.
పునః ఆచమనీయం
శ్రీమహాగణాధిపతయే నమః స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
అర్ఘపాద్యాల కోసం సమర్పించిన నీరు కాకుండా మరో పాత్రలో నీటిని ఆచమనీయంగా సమర్పించాలి.
వస్త్రం
శ్రీమహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి
పసుపు గణపతికి రవికముక్క లేదా కండువా లేదా పత్తితో చేసిన వస్త్రం లేదా పువ్వు సమర్పించవచ్చు.
యజ్ఞోపవీతం
శ్రీమహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి
పసుపు గణపతికి యజ్ఞోపవీతాన్ని కాని లేదా పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని కానీ సమర్పించాలి.
గంధం
శ్రీమహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి
పసుపు గణపతికి గంధం సమర్పించండి.
అక్షంతలు
శ్రీమహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి
పసుపు గణపతిపై అక్షంతలు వేయండి.
పుష్పాలు
కింది నామాలు చదువుతూ పసుపు గణపతిపై ఒక్కో పువ్వు ఉంచాలి.
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణకాయ నమః
ఓం లంబోదరాయ నమః

ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
ఓం మహాగణపతయే నమః
నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి.
ధూపం
శ్రీమహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి
పసుపు గణపతికి అగరు ధూపం చూపించండి.
దీపం
శ్రీమహాగణాధిపతయే నమః దీపం దర్శయామి
పసుపు గణపతికి చేతితో దీపం చూపించాలి.

శుద్ధ ఆచమనీయం
ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
పసుపు గణపతికి మంచినీటిని చూపించాలి.

Vinayaka2

నైవేద్యం

పసుపు గణపతికి బెల్లంముక్క, అరటిపండు, కొబ్బరి నైవేద్యంగా సమర్పించాలి.
కింది శ్లోకాన్ని చదువుతూ నైవేద్యం చుట్టూ నీళ్లు చల్లాలి.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యం త్వర్తేన పరిషించయామి
అమృతమస్తు పసుపు గణపతి వద్ద నీళ్లు విడిచిపెట్టాలి.
అమృతోపస్తరణమసి నైవేద్యం పైన కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఎడమచేతితో కుడిచేతిని పట్టుకుని … కింది శ్లోకాన్ని చదువుతూ కుడిచేతితో అయిదుసార్లు నైవేద్యాన్ని పసుపు గణపతికి చూపించాలి.
శ్రీమహాగణపతియే నమః నారికేళ సహిత
గుడోపహారం సమర్పయామి.
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా
ఓం బ్రహ్మణే స్వాహా
మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిథానమసి ఉత్తరాపోశనం సమర్పయామి
నీళ్లు చిలకరించాలి.
హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ నీళ్లు చల్లాలి.

తాంబులం

శ్రీమహాగణాధిపతయే నమః తాంబులం సమర్పయామి.
ఇంతకు ముందే సిద్ధం చేసుకున్న రెండు తాంబూలాల్ని పసుపు గణపతికి సమర్పించాలి.
నీరాజనం
శ్రీమహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి.
హారతి ఇచ్చి కళ్లకు అద్దుకోవాలి.
సర్వోపచారాలు
కింది శ్లోకాలు చదువుతూ పసుపు గణపతిపై అక్షంతలు వేయాలి.
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నోదంతిః ప్రచోదయాత్
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషూ సర్వదా
శ్రీమహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి
శ్రీమహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
శ్రీమహాగణాధిపతయే నమః ఛత్రమాచ్ఛాదయామి చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి , వాద్యం ఘోషయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, శకటానారోహయామి, ఆందోళికానారోహయామి సమస్త రాజోపచార, శక్తుపచార, భక్తుపచార పూజాం సమర్పయామి
అక్షంతలు, నీళ్లు పళ్లెంలో వదలాలి.
అక్షతధారణ
శ్రీమహాగణపతి దేవతాః సుప్రీతస్సుప్రసన్నో వరదో
భూత్వా వరదో భవతు.
ఏతత్పలం పరమేశ్వరార్పణమస్తు.
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తితి భవంతో బ్రువంతు
ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.
పసుపు గణపతి వద్ద కొన్ని అక్షంతలు తీసుకుని ఈ శ్లోకం చదివి శిరస్సుపై చల్లుకోవాలి.
ఉద్వాసన
శ్రీమహాగణాధిపతయే నమః గణపతిం ఉద్వాసయామి
శ్రీమహాగణాధిపతయే నమః యదాస్థానం ప్రవేశయామి
పసుపు గణపతిని ఆసీనపరిచిన తమలపాకును తూర్పుకు జరిపి మళ్లీ యథాస్థానంలో పెట్టాలి.
శోభనార్ధే క్షేమాయ పునరాగమనాయచ అక్షంతలు వేసి నమస్కరించాలి. ఇక్కడితో మహాగణపతి పూజ అంటే పసుపు పూజ పూర్తి అవుతుంది.

వినాయకుడికి పత్రితోనే ఎందుకు పూజ చేస్తారు?

వినాయకుడికి పత్రి పూజ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన గజముఖుడు కదా! అందుకే ఈ పత్రి పూజంటే ఆయనకు ఇష్టం. ఏకవింశతి… అంటే ఇరవైఒక్క రకాల పత్రితో గణేశుణ్ణి పూజిస్తాం. పూజలో ఉపయోగించే పత్రిలో విశేష ఔషధ గుణాలు ఉన్నాయి. నేత్ర, మూత్ర, చర్మ సంబంధమైన రోగాలతోపాటు మరికొన్ని ఇతర వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుందీ పత్రి. అంతేకాక ఆ పత్రి నుంచి వెలువడే సుగంధాన్ని పీల్చడం వల్ల కూడా ఆరోగ్యం  చేకూరుతుంది. పత్రిని మనం చేత్తో ముట్టుకోవడం వల్ల అందులో ఉండే వృక్ష సంబంధ రసాయన పదార్థాలు కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరం లోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. సర్వవిఘ్నాలకు అధిపతుడైన ఆ విఘ్నేశ్వరున్ని భక్తి శ్రద్ధలతో గోరంత పత్రితో పూజిస్తే  కొండంత వరాలు గుప్పిస్తాడు.  అందుకే భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ చేసుకోవడం పుణ్యప్రదం.

 vinayaka pooja samagri, Telangana news