Search
Saturday 17 November 2018
  • :
  • :

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి వినేష్ పొగట్

pogat

బిష్‌కెక్(కిర్గిస్థాన్): ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. 50 కేజీల మహిళల విభాగంలో వినేష్ పొగట్ ఫైనల్ చేరుకుంది. ఇప్పటికే పతకాన్ని ఖాయం చేసుకున్న వినేష్ స్వర్ణం కోసం తుది పోరులో చైనాకు చెందిన చున్‌లీతో తలపడనుంది. సెమీఫైనల్లో వినేష్ జపాన్ క్రీడాకారిణి యుకీ ఐరీపై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గతంలో వినేష్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.మరో రెజ్లర్ సంగీత కాంస్యం కోసం 59 కేజీల విభాగంలో కొరియా క్రీడాకారిణి జియూన్ ఉమ్‌తో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్లో సంగీత ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నబీర ఎసెన్‌బేవ చేతిలో 515తో పరాజయం పాలైంది. భారత్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారులు హర్‌ప్రీత్ సింగ్ 82 కేజీల విభాగంలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఖషింబెకోవ్‌ను 113తో, రాజేంద్ర కుమార్ 55 కేజీల విభాగంలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మిరఖ్‌మెదోవ్‌ను ఓడించి కాంస్య పతకాలు అందుకున్నారు.

Comments

comments