Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఆలిండియాలో ఫస్ట్ ర్యాంక్

All-India-First-Rank

జోగులాంబ గద్వాల్: సిఎమ్‌ఎ ఫౌండేషన్ పరీక్షలో ఆలిండియాలో ప్రథమ స్థానాన్ని జె. వినీత రెడ్డి చేజిక్కించుకుంది. ఈ విద్యార్థిని జోగులాంబ గద్వాల జిల్లా, ధరూరు మండల కేంద్రానికి చెందిన జె. వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీలతల కుమార్తె.  ఈ అమ్మాయి గుంటూరు మాస్టర్ మైండ్స్ కళాశాలలో చదువుతూ ది ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌటెంట్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన సిఎంఎ ఫౌండేషన్ పరీక్షలో 200 మార్కులకు 167 మార్కులను సాధించి బాలికల విభాగంలో ఆలిండియాలో వినీత రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకు ది ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌటెంట్స్ ఆఫ్ ఇండియా కోల్‌కత వారు వినీత రెడ్డికి ప్రశంస పత్రంతో పాటు పశ్చిమ బెంగాల్ అందించే స్వర్గీయ శ్రీమతి అన్నపూర్ణ, స్వర్గీయ రామన్ భట్టాచార్య బుక్ ఫ్రైజ్, నగదు బహుమతిని కూడా అందజేశారు. ఆలిండియాలో  ప్రథమ స్థానంలో నిలిచిన జె. వినీత రెడ్డిని జిల్లాలో ఉన్న విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు అభినందిస్తున్నారు.

Comments

comments