Search
Friday 16 November 2018
  • :
  • :

హింసకు దారితీసిన ట్రంప్ ర్యాలీ

Mexicoమెక్సికో : రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ హింసకు దారితీసింది. మంగళవారం రాత్రి ట్రంప్ న్యూమెక్సికోలో ప్రచారం చేస్తున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అల్బుకెర్క్, కన్వెన్షన్ సెంటర్ వెలుపల ఆందోళనకారులు టీషర్టులు, ప్లాస్టిక్ బాటిల్స్ , ఇతర వస్తువులకు నిప్పంటించి పోలీసులపైకి విసరడంతో ర్యాలీ హింసాత్మకంగా మారింది. బారికేడ్లను తోసిపడేసి నిరసనకారులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు పెప్పర్ స్ప్రే ఫైర్ చేశారు. స్మోక్ గ్రనేడ్లు వదిలారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రత సిబ్బంది విశ్వ ప్రయత్నం చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆయన సభకు ఆటంకం కలిగింది. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఆందోళనకారులను వెంటనే అక్కడి నుంచి పంపివేయాలని ట్రంప్ భద్రత సిబ్బందిని ఆదేశించారు.

Comments

comments