Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఉన్నావోలో మరో అమానుష ఘటన (వైరల్ వీడియో)

haresment
లక్నో: ఓ మహిళపై ముగ్గురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించి వేధించిన అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో జరిగింది. బాధితురాలు  తనను వదిలేయాలని ప్రాధేయపడినప్పటికి ఆ యువకులు కనికరించలేదు. మహిళను వేధిస్తున్న దృశ్యాలను తమ స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల పేర్లు రాహుల్, ఆకాశ్‌ అని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నమని పోలీసులు చెప్పారు. ఇంట్లో ఉన్న ఆ మహిళను నిందితులు బలవంతంగా లాక్కెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు విచారణలో తేలింది. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారు.

Comments

comments