Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

విరసం నేత వరవరరావు అరెస్టు

Virasam Leader Varavara Rao arrested

హైదరాబాద్ : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును మంగళవారం పుణె పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ హత్యకు కుట్ర పన్నారంటూ ఈరోజు ఉదయం వరవరరావు ఇంటితో పాటు ఆయన కూతురు ఇంట్లో పుణె పోలీసులు సోదాలు చేశారు. సోదాల అనంతరం వరవరరావును అరెస్టు చేశారు. వరవరరావుకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తారు. అనంతరం నాంపల్లి కోర్జుటలో హాజరుపర్చి పుణెకు తరలించనున్నట్టు తెలిసింది. ప్రధాని మోడీని హత్య చేసుందకు మావోయిస్టులు కుట్ర చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మావోయిస్టులు రాసిన లేఖలో వరవరరావు పేరున్నట్టు పుణె పోలీసులు గుర్తించి, ఆయనపై కేసు నమోదు చేశారు. మావోయిస్టులకు నిధుల సమీకరణలోనూ వరవరరావు పాత్ర ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వరవరరావు అరెస్టుతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. దీంతో ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమను ఏడు గంటల పాటు నిర్బంధించి సోదాలు చేశారని వరవరరావు సతీమణి మీడియాకు తెలిపారు. మావోయిస్టులు రాసిన లేఖలో తన భర్త పేరుండడంతోనే తమను పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Virasam Leader Varavara Rao arrested

Comments

comments