Home తాజా వార్తలు విరాట్ ను కౌగిలించుకున్న వీరాభిమాని

విరాట్ ను కౌగిలించుకున్న వీరాభిమాని

Virat-Kohli-Hug

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్- వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు  మధ్యలోకి  కోహ్లి వీరాభిమాని మైదానంలోకి వెళ్లి  విరాట్ ను కౌగిలించుకున్నాడు. తరువాత ముద్దు ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా కోహ్లి నిరాకరించాడు. యువకుడితో కోహ్లి సెల్ఫీ దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడు ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన అహ్మద్ ఖాన్ గుర్తించారు. కోహ్లీకి తాను వీరాభిమానాని పోలీసులకు తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు విండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో చేజ్(49) హోల్డర్ (6) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశాడు.

Virat Fan Hug Kohli in Uppal Stadium

Telangana news